
రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మిస్టర్ ఇడియట్’. సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘పెళ్లి సందD’ ఫేమ్ గౌరి రోణంకి దర్శకత్వంలో జేజేఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. శుక్రవారం మాధవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘రవితేజ సోదరుడు రఘు కొడుకు మాధవ్ ఈ సినిమాతో హీరోగా స్థిరపడాలని విష్ చేస్తున్నా. ‘పెళ్లి సందD’ లాంటి మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్ రూపొందించిన నా శిష్యురాలు గౌరి రోణంకి ఈ చిత్రాన్ని కూడా అందరినీ ఆకట్టుకునేలా తెరకెక్కించిందని ఆశిస్తున్నా. రవితేజ ఇడియట్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఈ ‘మిస్టర్ ఇడియట్’ కూడా అంతకంటే పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’ అన్నారు.
షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ జరుగుతోందని, నవంబర్‌లో సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నామని దర్శక నిర్మాతలు చెప్పారు.