మగాడు ప్రెగ్నెంట్​ అయితే?

మగాడు ప్రెగ్నెంట్​ అయితే?

‘బిగ్‌‌‌‌బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్, రూపా కొడవాయుర్ జంటగా శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’.  అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలు. ఆగస్టు 18న సినిమా విడుదలవుతోంది. శనివారం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్​లో నాగార్జున మాట్లాడుతూ ‘బిగ్‌‌‌‌బాస్‌‌‌‌లో కప్పు గెలవకుండానే విన్నర్ అయ్యాడు సోహైల్.  ప్రతి గేమ్, ప్రతి టాస్క్ కష్టపడి ఆడేవాడు. గెలవాలనే తపన అతనిలో కనిపించేది. అలాంటి పట్టుదలతోనే ఈ సినిమా చేశాడు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనగానే మగవాళ్లు ప్రెగ్నెంట్ ఎలా అవుతారు, అది సినిమాలో ఎలా చూపించారు అనే ఆసక్తి కలిగింది. 

ట్రైలర్ చూశాక సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది.  ఇలాంటి డిఫికల్ సబ్జెక్ట్‌‌‌‌తో వస్తున్న టీమ్ అందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటున్నా’ అన్నారు. సోహైల్ మాట్లాడుతూ -‘9 నెలలు బిడ్డను మోసి కనేందుకు తల్లి  ఎంత కష్టపడుతుందో..  ఒక అబ్బాయిగా నా పాత్ర ద్వారా చూపించబోతున్నా. ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ రెండూ ఉంటాయి. ఈ సినిమా చూశాక ఇంటికి వెళ్లి అమ్మను హగ్ చేసుకుంటారు’ అని చెప్పాడు.  కొత్త తరహా కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇదొక ఫీస్ట్ లాంటి సినిమా అంది రూపా కొడవయూర్. డెలివరీ కోసం అమ్మ పడే కష్టాన్ని తీసుకున్న ఓ నాన్న కథ ఇది అన్నాడు దర్శకుడు శ్రీనివాస్. యూనిక్ కాన్సెప్ట్‌‌‌‌తో సినిమా తీశామని నిర్మాతలు చెప్పారు.