MRO ట్రాన్స్ఫర్.. పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకుని స్థానికుల సంబరాలు.. కరీంనగర్ చిగురుమామిడిలో ఘటన

MRO ట్రాన్స్ఫర్.. పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకుని స్థానికుల సంబరాలు.. కరీంనగర్ చిగురుమామిడిలో ఘటన

కరీంనగర్: MRO ట్రాన్స్ఫర్ అవడంతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. ఈ ఘటన కరీంనగర్ చిగురుమామిడిలో జరిగింది. చిగురుమామిడి తహశీల్దార్‌గా పనిచేసిన ముద్దసాని రమేష్ బదిలీపై వెళ్లడంతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు.

తహశీల్దార్ కార్యాలయం ఎదుట టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న సమయంలో పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేశారంటూ స్థానికులు ఆరోపించారు. గతంలో అవినీతికి పాల్పడ్డారంటూ తీవ్ర విమర్శలు చేశారు.

►ALSO READ | నాకు ఆ బ్రీడ్ కుక్క పిల్ల కావాలి: పవన్ కల్యాణ్‎ను వింత కోరిక కోరిన అభిమాని

భూ సంబంధిత సమస్యలు, రెవెన్యూ వ్యవహారాల్లో అన్యాయం జరిగిందనేది స్థానికుల ఆరోపణ. గతంలో ముద్దసాని రమేష్‌పై ప్రజావాణిలో అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి. బదిలీ వార్త తెలిసిన వెంటనే స్థానికులు కార్యాలయం వద్ద చేరుకుని సంబరాలు చేసుకోవడం గమనార్హం. రమేష్ తప్పిదాల వల్ల నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.