
‘సీతారామం’తో మృణాల్ ఠాకూర్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఈ హీరోయిన్ నెక్ట్స్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే వరుస ఆఫర్లతో ఈ నటి బిజీగా మారింది. తాజాగా టాలీవుడ్లో ఓ క్రేజీ ఆఫర్‌ను కొట్టేసినట్టు తెలుస్తోంది. డైరెక్టర్ పరుశురాంతో విజయ్ దేవరకొండ ఓ కొత్త సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
‘గీత గోవిందం’ సినిమాకి ఇది సీక్వెల్ అనే టాక్ నడుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దేను కన్ఫర్మ్ చేసినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో మృణాల్ చాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. రేపు ఈ మూవీని హైదరాబాద్ వేదికగా గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు పరశురాం పూర్తిస్థాయి లవ్ స్టోరీగా దీనిని తెరకెక్కిస్తున్నాడట. ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఈ వార్త సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.