Dhoni– Gambhir: మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది.. ధోనీ పోస్ట్‌పై గంభీర్ రియాక్షన్

Dhoni– Gambhir: మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది.. ధోనీ పోస్ట్‌పై గంభీర్ రియాక్షన్

Dhoni– Gambhir: భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత దేశవ్యాప్తంగా సంబరాలు జోరుగా జరిగాయి. ఈ విజయంతో మైదానంలోనే కాదు, సోషల్ మీడియాలో కూడా ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు చేసిన ఫన్నీ కామెంట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించిన తర్వాత సోషల్ మీడియాలో జట్టుకు, సపోర్ట్ స్టాఫ్‌కు అభినందనలు తెలిపారు ఎంఎస్ ధోనీ.. 

గంభీర్ కి ధోనీ ప్రశంసలు: 
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంఎస్ ధోనీ తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ.. అహ్మదాబాద్‌లో చరిత్ర సృష్టించారు.. టీమిండియా క్రికెట్ జట్టుకు, సపోర్ట్ స్టాఫ్‌కు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కు హృదయపూర్వక అభినందనలు.. మీరు ఆటను చూడటం చాలా ఆనందంగా ఉంది.. 'కోచ్ సాబ్'.. మీ ముఖంపై చిరు నవ్వు చాలా బాగుంది.. కోపం, చిరునవ్వు.. ఈ రెండింటి కలయిక కిల్లర్ కాంబినేషన్! చాలా బాగా మిక్స్ చేశారు, ఎంజాయ్ చేయండి గైస్! అని పోస్టులో పేర్కొన్నారు.  

►ALSO READ | Tea Cup Troll: పాకిస్తాన్ ని ‘టీ కప్’తో ట్రోల్ చేసిన వరుణ్ చక్రవర్తి.. నెట్టింట ఫన్నీ కామెంట్స్

ధోనీ మెసేజ్‌కు గంభీర్ రిప్లై: 
ఇలాంటి విజయానికి నవ్వకుండా ఎలా ఉంటాం.. మైదానంలో మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉందని ధోనీకి గంభీర్ కృతజ్ఞతలు తెలిపాడు. భారత క్రికెట్‌లో ధోనీ, గంభీర్ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 2011 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ లో వీరిద్దరూ ఆడిన కీలక ఇన్నింగ్స్ తో భారత్‌కు ట్రోఫీ వచ్చింది. అందుకే ఈ ఇద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ అభిమానులను మరింత ఆకట్టుకుంది.