క్రికెటర్ ఎంఎస్ ధోనీ పెట్టుబడులు ఉన్న ఫిజిటల్ లెండింగ్ కంపెనీ ఫిన్‌బడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, తమ పబ్లిక్ ఇష్యూ కోసం ఒక్కో షేరుకు రూ. 140--–142 ప్రైస్బ్యాండ్ను నిర్ణయించింది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 71.6 కోట్ల నిధులను సమీకరిస్తుంది. ఐపీఓ నవంబర్ 6న ప్రారంభమై నవంబర్ 10న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ నవంబర్ 4న జరుగుతుంది.
ఈ ఐపీఓ పూర్తిగా 50.48 లక్షల కొత్త ఈక్విటీ షేర్ల జారీతో రూ. 71.68 కోట్లను సమీకరించనుంది. ఈ నిధులను కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, అనుబంధ సంస్థ ఎల్టీసీవీ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టుబడి, వ్యాపార అభివృద్ధి, అప్పుల చెల్లింపులకు ఉపయోగిస్తారు.
