దేశభక్తి చాటుకున్న ధోనీ.. రాంచీలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

దేశభక్తి చాటుకున్న ధోనీ.. రాంచీలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దేశంపై తనకు ఎంత అభిమానం ఉందో చాటుకున్నాడు. తన స్వస్థలనమైన రాంచీలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాడు. రాంచీలో ఉన్న తన విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లో భారతీయ త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగురవేశాడు. ధోని భార్య సాక్షి..ఈ గొప్ప సందర్భాన్ని వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. ఇది చూసిన మహేంద్రుడి అభిమానులు ఈ జంటకు గణతంత్ర దినోత్సవ  శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  

MS ధోని కేవలం క్రికెటర్ మాత్రమే కాదు. ఈ దిగ్గజ క్రికెటర్ ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీకి చెందిన పారాచూట్ రెజిమెంట్‌లో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ ర్యాంక్‌ను కూడా కలిగి ఉన్నాడు. భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన ఏకైక కెప్టెన్ గా ధోనీ నిలిచాడు. 2007 లో టీ20 వరల్డ్ కప్ తో పాటు, 2011 లో వన్డే వరల్డ్ కప్, 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీను భారత్ ధోనీ సారధ్యంలో గెలుచుకుంది. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ ధోనీ కెరీర్ లో చివరి అంతర్జాతీయ మ్యాచ్.  

ప్రస్తుతం ధోనీ ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. 2023 లో ధోనీ సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది. గుజరాత్ టైటాన్స్ పై ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరి బతికి చెన్నై విజయం సాధించింది. ఈ మెగా టోర్నీ మోకాలి గాయం బారిన పడిన ధోనీ.. వేగంగా కోలుకుంటున్నాడు. నివేదికల ప్రకారం ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని తెలుస్తుంది.