ధోని ఆటోగ్రాఫ్ ఎక్కడ చేశాడో తెలుసా

ధోని ఆటోగ్రాఫ్ ఎక్కడ చేశాడో తెలుసా

మిస్టర్ కూల్, టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి ఎంతో మంది అభిమానులున్నారు. అయన ఇప్పటికీ జట్టులో ఉండాలని కోరుకునే వారి సంఖ్య ఎంతగా ఉందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోని ఫ్యామిలీతో గడుపుతున్నాడు. వన్డే వరల్డ్‌ కప్‌ ముగిసిన తర్వాత తన వ్యక్తిగత పనులు చుసుకుంటూ కుటుంబంతోనే ఉంటున్నాడు. అయినా ధోని  ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మాత్రం అలానే ఉంది. ఈ క్రమంలోనే ఒక అభిమానికి ధోనిని అనుకోకుండా కలిసే అవకాశం వచ్చింది. ఆ సందర్భంగానే ఆటో గ్రాఫ్ కావాలని కోరాడు. అయితే ఆటోగ్రాఫ్‌ అడిగిన ఆ అభిమానికి అనుకున్న దానికన్నా ఎక్కువ సంతోషాన్ని కలిగించింది. ఆటగాళ్లు మామూలుగా.. టీ షర్టులపై కానీ జెర్సీలపై ఆటోగ్రాఫ్ లు చేస్తారు. ధోని మాత్రం ఆ అభిమాని బైక్ ఎన్‌ఫీల్డ్‌పై సంతకం చేశాడు. దాంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.