ధోనీ మోకాలికి గాయం

ధోనీ మోకాలికి గాయం

చెన్నై: చెన్నై సూపర్‌‌‌‌‌‌‌‌కింగ్స్‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌కు బ్యాడ్‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌. తమ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ ఎంఎస్‌‌‌‌‌‌‌‌ ధోనీ మోకాలి ఇంజ్యురీతో బాధపడుతున్నాడని సీఎస్కే హెడ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ స్టీఫెన్‌‌‌‌‌‌‌‌ ఫ్లెమింగ్‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు. దీంతో మహీ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో చురుకుగాకదల్లేకపోతున్నాడని తెలిపాడు. ఈ కారణంగానే రాజస్తాన్‌‌‌‌‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఆఖరి బాల్‌‌‌‌‌‌‌‌కు స్పీడ్‌‌‌‌‌‌‌‌గా పరుగెత్తలేకపోయాడని గుర్తు చేశాడు. ‘మహీ మోకాలికి గాయమైంది. ఇది అతని కదలికలకు అంతరాయం కలిగిస్తున్నది. ఇది మినహా అతని ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ మాదిరిగానే ఉన్నాడు. 

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌కు కొన్ని రోజుల ముందు నుంచి రాంచీలో అతను ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌, నెట్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ మొదలుపెడతాడు. కానీ నెల రోజుల ముందు చెన్నై వచ్చి చేసే ప్రాక్టీసే అతనికి చాలా ముఖ్యమైంది’ అని ఫ్లెమింగ్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. మరోవైపు పేసర్‌‌‌‌‌‌‌‌ సిసాండా మగాలా (సౌతాఫ్రికా) చేతి గాయంతో రెండు వారాల పాటు ఆటకు దూరమయ్యాడు. రాయల్స్‌‌‌‌‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో రెండు ఓవర్లు వేసిన తర్వాత మగాల.. స్ప్లిట్‌‌‌‌‌‌‌‌ వెబ్బింగ్‌‌‌‌‌‌‌‌ (వేళ్ల మధ్య చర్మం చీరుకుపోవడం)కు గురయ్యాడు. దీంతో అతను మిగతా రెండు ఓవర్లు వేయలేకపోయాడు.