
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ MS ధోని జార్ఖండ్‌లోని ప్రసిద్ధ దేవాలయం డియోరిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలు IPL కోసమే నిర్వహించినట్లు సమాచారం.BCCI తన కాంట్రాక్టు నుంచి ధోనీని మినహాయించడంతో అందరూ ధోని కెరీర్ ఇక ముగిసినట్లే అనుకున్నారు. అయితే ఇటీవలే టీమిండియా కోచ్ రవి శాస్త్రి IPLలో ధోని రాణిస్తే.. ప్రపంచకప్ కోసం ఎంపికని పరిశీలిస్తామని చెప్పారు. గతంలో ధోని 2011 వన్డే వరల్డ్ కప్ ముందు కూడా డియోరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఆ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. అయితే మళ్లీ ఇప్పుడు మరోసారి ధోని అదే దేవాలయంలో పూజలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.