
ఐపీఎల్ లో (IPL2023) ఛాంపియన్ జట్టు, నాలుగు సీజన్ విజేత (csk) చెన్నై సూపర్ కింగ్స్ 2023 ఐపీఎల్ సీజన్ సన్నాహాలు మొదలుపెట్టింది. (ms dhoni) మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే లాస్ట్ ఐపీఎల్ అన్న కారణం, ఈ సారి ఎలాగైనా కప్పు గెలవాలనే కసితో సీఎస్ కే మేనేజ్మెంట్ ఉంది. ఆ లక్ష్యంతో జట్టును సిద్ధం చేస్తోంది.
ఈ సారి ధోనీనే కెప్టెన్సీ చేస్తాడని ఫ్రాంచేజీ ఇప్పటికే ప్రకటించింది. (csk playing 11) బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, శివమ్ దూబే, మిచెల్ సాంట్‌నర్ లాంటి ఆల్ రౌండర్‌లతో ఈ సారి సీఎస్ కే లైనప్ భలంగా కనిపిస్తోంది. పోయిన సారితో పోల్చితే ఈ ఏడాది సీఎస్ కే టీం కొంత ప్రమాదకరంగా కనిపిస్తోంది.
ఐపీఎల్ సీజన్ కు టైం దగ్గర పడటంతో సీఎస్ కే తమ ప్లేయింగ్ లెవన్ ని ప్రకటించింది. ఈసారి బ్యాటింగ్ ఆర్డర్ ని పూర్తిగా మార్చుతూ కెప్టెన్ ధోనీని (ms dhoni) నంబర్ 4 లో ఆడించాలని చూస్తోంది. తాజాగా జట్టు మెయిన్ ప్లెయింగ్ లెవన్ ను ప్రకటించింది. డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, ఎంఎస్ ధోనీ, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, దీపక్ చాహర్, సిమర్ జీత్ సింగ్, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరిలతో కూడిన ఆర్డర్ ను చూస్తుంటే ఈసారి కప్పు సీఎస్ కే కొట్టడం గ్యారెంటీ అనిపిస్తోంది.