రిటైర్మెంట్ తర్వాత అక్కడే నా జీవితం.. ధోనీ ఆన్సర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

రిటైర్మెంట్ తర్వాత అక్కడే నా జీవితం.. ధోనీ ఆన్సర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

సాధారణంగా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తే ఏ ఆటగాడైనా కామెంటేటర్, కోచ్ పదవులపై ఆసక్తి చూపిస్తారు. అలా కాని పక్షంలో ఏ బిజినెస్ చేసుకుంటూ కాలాన్ని గడిపేస్తారు. క్రికెట్ లో ఎంతటి దిగ్గజాలకైనా వీటికే ప్రాధాన్యం ఇస్తారు. కానీ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం వీటికి భిన్నం. క్రికెట్ కు పూర్తిగా గుడ్ బై చెప్పిన తర్వాత ఆర్మీలో గడపాలనుకుతున్నా అని తన మనసులో మాటను బయట పెట్టాడు.

ఇటీవలే ఒక కార్యక్రమంలో పాల్గొన్న ధోనీకి ఒక అభిమాని క్రికెట్ తర్వాత మీరు ఏం చేస్తారనే ప్రశ్న ఎదురైంది. దీనికి ధోనీ స్పందిస్తూ " ప్రస్తుతం నేను ఐపీఎల్ ఆడుతున్నాను. నా దృష్టాంతా ఈ టోర్నీ మీదే ఉంది. ఒకవేళ క్రికెట్ కు పూర్తిగా వీడ్కోలు పలికితే ఆర్మీలో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను" అని మహేంద్రుడు చెప్పుకొచ్చాడు. ధోనీ చెప్పిన  సమాధానికి అక్కడ ఉన్నవారందరూ ఇంప్రెస్స్ అయ్యారు. ఇప్పటివరకు క్రికెట్ లో దేశానికి ఎన్నో ట్రోఫీలు అందించిన ధోనీ.. ఆర్మీలో చేరడంపై ఆసక్తి చూపించడం నిజంగా చాలా గొప్ప విషయం. 

ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోనీ కొనసాగుతున్నాడు. 2023లో చెన్నై జట్టును విజేతగా నిలిపిన మహీ..2024 ఐపీఎల్ ఆడటం ఖాయమైంది. ఇటీవలే మోకాలికి సర్జరీ చేయించుకున్న ధోనీ.. పూర్తి ఫిట్ నెస్ సాధించే పనిలో ఉన్నాడు. ఐపీఎల్ లో అన్ని జట్లకు కెప్టెన్ లు మారినా చెన్నై జట్టును మాత్రం ఇంకా ధోనీనే నడిపిస్తున్నాడు.  2008 నుంచి ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా చేసిన మహీ.. 2024 సీజన్ తర్వాత రిటైర్మెంట్ అయ్యే వకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2023 సీజన్ ధోనీది చివరిదని భావించినా.. ఫ్యాన్స్ కోసం 2024 సీజన్ కూడా ఆడనున్నట్లు తెలుస్తుంది.