
చెన్నై: చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. ఈ సీజన్ ఐపీఎల్‌కు రెడీ అవుతున్న కెప్టెన్ ఎంఎస్ ధోనీ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి ప్రాక్టీస్ సందర్భంగా అతను ఎడమ కాలి నొప్పితో ఇబ్బందిపడ్డాడు. ముందుగా నెట్స్‌లోకి వచ్చిన మహీ ప్రాక్టీస్ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఎడమ మోకాలికి క్యాప్ ధరించి ప్రాక్టీస్ చేశాడు. కాలిపై ఒత్తిడి పడకుండా చాలా పరిమితంగా రన్నింగ్ చేస్తూ మధ్యలో కాలును అటు ఇటు తిప్పుతూ, గట్టిగా నొక్కి పడుతూ గాయాన్ని అంచనా వేసుకున్నాడు.
ఆ తర్వాత నెట్స్‌ను వదిలేసి గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు. అక్కడ కాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. మహీ ప్రాక్టీస్ సెషన్‌ను చూసేందుకు సీఎస్‌కే పర్మిషన్ ఇవ్వడంతో చెపాక్ స్టేడియం ఫ్యాన్స్‌తో హోరెత్తింది. మహీ గాయంపై ఇప్పటివరకు పెద్దగా ఆందోళన లేకపోయినా.. ఒకవేళ తీవ్రంగా మారితే ఎలా అన్న దానిపై కూడా చర్చ మొదలైంది. మహీకి సరితూగే కెప్టెన్‌ని, కీపర్‌ను వెతకాలి. ప్రస్తుతం బెన్ స్టోక్స్ అందుబాటులో ఉన్నాడు కాబట్టి నాయకత్వానికి ఇబ్బంది లేకపోవచ్చు.
అయితే మోకాలి గాయం వల్ల స్టోక్స్ కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగుతుండటంతో కెప్టెన్సీ పెద్ద భారం కాకపోవచ్చు. కీపర్‌గా అంబటి రాయుడు, డేవన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్‌లో ఒకర్ని తీసుకుంటే సరిపోతుంది. ఓవరాల్‌గా చివరి ప్రాక్టీస్ సెషన్ తర్వాత మహీపై తుది నిర్ణయం తీసుకునే చాన్సెస్ ఉన్నాయి.