
మహేంద్ర సింగ్ ధోనీ మరో రెండేళ్లపాటు CSK లో కొనసాగనున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ ప్రకటించారు. ధోనీకి మరో రెండేళ్ల పాటు క్రికెట్ ఆడగలిగే సత్తా ఉందని.. ప్రస్తుతం అతను పూర్తి ఫిట్‌గా ఉన్నాడని చెప్పారు. దీంతో తమ అభిమాన క్రికెటర్‌ను ఇండియన్ కలర్స్‌లో చూడలేకపోయినా.. కనీసం మరో రెండేళ్లు ఫీల్డ్‌లో చూసే అవకాశం దక్కనుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ధోనీ క్రికెట్‌లో కొనసాగకపోవడానికి ఎలాంటి కారణం లేదని, అతను ఫిట్‌గా ఉన్నంతకాలం సీఎస్కేతో ట్రావెల్ చేస్తాడని కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశాడు. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ధోనీ అందించిన సేవల పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని, సీఎస్కేకు అతని అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ ఏడాది IPLలో ప్లేయర్‌గా పెద్దగా రాణించలేకపోయిన ధోనీ.. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించాడు. కరోనా కారణంగా టోర్నీ అర్ధంతరంగా ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో చెన్నైను రెండో స్థానంలో నిలిపాడు.