విన్నింగ్ షాట్ బ్యాట్‌కు రూ. 83 లక్షలు..ధోని క్రేజ్ అంటే ఇదీ

 విన్నింగ్ షాట్ బ్యాట్‌కు రూ. 83 లక్షలు..ధోని క్రేజ్ అంటే ఇదీ

2011 వరల్డ్ కప్ ఫైనల్ క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోని మ్యాచ్. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ధోని కొట్టిన విన్నింగ్ షాట్ ఇప్పటికీ అభిమానుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది.   ధోని ఆ షాట్ కొట్టగానే...ధోనీ.. ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్... ఏ మాగ్నిఫిషియెంట్ స్ట్రైక్ ఇంటు ద క్రౌడ్.. ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఈయర్స్... ద పార్టీ బిగిన్స్ ఇన్ డ్రెస్సింగ్ రూమ్..'అంటూ  కామెంటేటర్ రవిశాస్త్రి అన్న మాటలు..ఇప్పటికీ ప్రతీ భారతీయ క్రికెట్ అభిమాని చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి. 


2011 వరల్డ్ కప్ ఫైనల్లో ధోని ఉపయోగించిన బ్యాట్‌ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ బ్యాట్ కు వేలంలో ఊహించని ధర పలికింది. లండన్‌లోని ఓ చారిటీ ఈవెంట్‌లో ధోనీ బ్యాట్‌ను వేలం వేశారు. ఈ వేలంలో బ్యాట్ ఏకంగా  రూ.83 లక్షలు పలికింది. ఆర్కే గ్లోబల్‌ షేర్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌(ఇండియా) కంపెనీ ఈ  భారీ ధరకు ధోని  బ్యాట్‌ను కొనుక్కుంది.  ఈ  డబ్బును ధోనీ సతీమణి సాక్షి ఆధ్వర్యంలో నడిచే సాక్షి ఫౌండేషన్‌ ఖర్చు చేయనుంది. ధోని బ్యాట్కు  వేలంలో రూ. 83 లక్షలు పలకడంతో ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్యాట్గా నిలిచిపోయింది.