
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. అమెరికాలోని బెవెర్లీ హిల్స్ లో జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్ ఫంక్షన్ లో రామ్ చరణ్ సందడి చేశారు. ఈ వేడుకలో అవార్డు ప్రజెంటర్గా పాల్గొన్న చరణ్.. బెస్ట్ వాయిస్ ఓవర్ అవార్డును ప్రకటించారు.
హాలీవుడ్ నటి అంజలి భీమానీ తో కలిసి బెస్ట్ వాయిస్ మోషన్ క్యాప్చర్ అవార్డును రామ్ చరణ్ అందించారు. చరణ్ పక్కన నిల్చున్నందుకు ఆనందంగా ఉందని హాలీవుడ్ భామ అంజలీ అన్నారు. ఆయనతో కలిసి అవార్డును అందించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. ఇదే తనకు అవార్డ్ విన్నింగ్ మూమెంట్ అని చెప్పారు. మరోవైపు ట్రిపుల్ ఆర్ బృందం ప్రస్తుతం అమెరికాలో ఉంది. మార్చి 12న జరిగే ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కోసం యూఎస్ చేరుకున్నారు. ఇంకోవైపు మార్చి 16న విడుదల కానున్న క్రిటిక్స్ సూపర్ అవార్డ్స్ ఉత్తమ నటుడు అవార్డుకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నామినేట్ అయ్యారు.