రెండో రౌండ్లో దూసుకుపోయిన ముర్ము

రెండో రౌండ్లో దూసుకుపోయిన ముర్ము

రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము దూసుకుపోతున్నారు. రెండో రౌండ్లోనూ  భారీ ఆధిక్యం సాధించారు. ఆల్పాబెటికల్ ఆర్డర్ ప్రకారం 10  రాష్ట్రాల్లో 1138 మంది ఎమ్మెల్యేల ఓట్లు చెల్లుబాటు కాగా.. వాటిలో  ద్రౌపది ముర్ముకు 1,05,299  విలువైన 809 ఓట్లు వచ్చినట్లు రాజ్యసభ సెక్రటరీ పీసీ మోడీ తెలిపారు. సెకండ్ రౌండ్ లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేవలం  329 ఓట్లు  మాత్రమే దక్కాయి. వాటి విలువ 44,276.

ఎంపీలు, 10 రాష్ట్రాలతో కలుపుకొని ఇప్పటి వరకు లెక్కించిన ఓట్ల సంఖ్య 1,886 కాగా.. వాటి విలువ 6,73,175. ఆ ఓట్లలో 1,349 ద్రౌపది ముర్ము ఖాతాలో పడ్డాయి. వాటి విలువ 4,83,299. ఇక యశ్వంత్ సిన్హాకు ఇప్పటి వరకు 1,89,876 విలువైన 537 ఓట్లు మాత్రమే పడ్డాయని పీసీ మోడీ ప్రకటించారు.