రైతులకు శుభవార్త : రైతు ఉద్యమంతో పెరిగిన పాల ధర

రైతులకు శుభవార్త : రైతు ఉద్యమంతో పెరిగిన పాల ధర

రైతులకు  ప్రభుత్వం అదిరే గుడ్‌న్యూస్ అందించింది. దేశ వ్యాప్తంగా రైతులు  పంట మద్దతు ధర కోసం ఉద్యమంచేస్తుంటే...  పాల ధరను పెంచుతూ హిమాచల్​ ప్రదేశ్​ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  .. రైతుల ఆందోళన నేపథ్యంలో  MSPకి సంబంధించి కీలకమైన నిర్ణయమైన నిర్ణయం తీసుకుంది.  పాల ధర MSPను పెంచింది.  పశువుల పెంపకం దార్ల ఆర్థిక స్థితి మెరుగుపర్చేందుకు ఈ నిర్ణయం తీసున్నామని  ప్రభుత్వం ప్రకటించింది.  పాల ఎంఎస్‌పిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

పాలపై MSP ఎంత పెరిగిందంటే....

దేశ వ్యాప్తంగా అధిక జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.  రైతులు అదనపు ఆదాయం కోసం రైతులు పశుపోషణ చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో పాల వ్యాపారానికి బాగా గిరాకీ ఉంది. చాలా మంది పాలు  అమ్మి జీవనోపాధి కొనసాగిస్తున్నారు. పశుగ్రాసం ధర పెరిగి.. పాలకు సరైన ధర లభించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. పశువుల రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పాలపై MSPని పెంచుతున్నట్లు ప్రకటించింది.  ఆవు సాల MSP లీటర్​ కు రూ. 38 నుంచి రూ. 45కి పెంచగా... గేదె పాల MSPని రూ 38 నుంచి రూ. 55 కి పెంచుతూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన MSP ధరలు 2024 ఏప్రిల్​ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 

ఏ రాష్ట్రంలో ధరలు పెరిగాయంటే...

పాలపై MSPపెంపు నిర్ణయంతో పశువుల రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపడుతుంది.  దాణా, ధాన్యాల ధరల పెరుగుదలతో పశువుల నిర్వహణ, పశువుల పోషణ ఖర్చులు పెరగడంతో పాల వ్యాపారులు చాలా కాలంగా పాల ధర తక్కువగా ఉండటంతో ఆందోళన చెందారు. MSPని పెంచడం ద్వారా వారి ఆదాయాలు పెరిగే అవకాశం ఉంది.  హిమాచల్ ప్రదేశ్‌లోని పశువుల పెంపకందారులు మాత్రమే పాలపై పెరిగిన MSP ప్రయోజనం పొందుతారు.