హైదరాబాద్, వెలుగు: డెక్కన్ పాడెల్ లీగ్ (డీపీఎల్) తొలి సీజన్‌లో ముధోల్ హౌండ్స్ టీమ్ తిరుగులేని ఆధిపత్యం చూపెడుతోంది. మహవీర్ స్టార్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో హౌండ్స్ టీమ్ మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ర్యాలీ టైగర్స్, బోవర్ బుల్స్ తలో రెండు విజయాలతో 6 పాయింట్లు సాధించి తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ పాడెల్ పాంథర్స్, మహవీర్ స్టార్స్ చెరో విజయాన్ని నమోదు చేసి 3 పాయింట్లతో ఉన్నాయి.
