35 ఏండ్లకు కలుసుకున్నా ముదిగొండ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు

35 ఏండ్లకు కలుసుకున్నా ముదిగొండ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు

ముదిగొండ, వెలుగు : ముదిగొండ జడ్పీహెచ్ఎస్ 1989–90 టెన్త్​ బ్యాచ్​ స్టూడెంట్స్​ 35 ఏండ్ల తర్వాత కలుసుకున్నారు. ఆదివారం అదే స్కూల్​లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని మురిసిపోయారు. ఆటపాటలతో సందడి చేశారు. నాటి గురువులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కమర్తపు కిరణ్, వెంపటి శ్రీను, యలమద్ది శ్రీను, ఇంద్ర కుమార్, మాచర్ల ఉపేందర్, బంక మల్లయ్య, ఎస్​కే ఖాసిం, లక్ష్మీరాజ్య, రమాదేవి, భాగ్యయ్య, నక్క నరసింహారావు, పరిపూర్ల చారి, కమర్తపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

నర్సాపురం హైస్కూల్​లో.. .

భద్రాచలం :  దుమ్ముగూడెం మండలం నర్సాపురం సూదిరెడ్డి నాగిరెడ్డి ఆది లక్ష్మమ్మ మెమోరియల్​ జిల్లా పరిషత్​ హైస్కూల్​లో ఆదివారం 2000–-01 పదో తరగతి బ్యాచ్​కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆటపాటలతో సరదాగా గడిపారు. తమకు విద్యాబోధించిన గురువులను సన్మానించారు. ముగ్గురు స్నేహితుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు.