
ముకేశ్ అంబానీ మళ్లీ తాత అయ్యారు. ఆయన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా దంపతులు రెండో బిడ్డను స్వాగతించారు. అయితే ఈ సారి వీరికి రెండో సంతానంగా ఆడబిడ్డ జన్మించింది. ఈ పాప రాకతో తమ కుటుంబం ఒక పరిపూర్ణమైన కుటుంబం అయిందని అంబానీ దంపతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
సోషల్ మీడియాలో నెటిజన్లు ఆకాష్, శ్లోకా దంపతులకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా ఆకాష్, శ్లోకాలకు 2019 మార్చి 9న వివాహాం జరగగా, వీరికి మొదటి బిడ్డగా పృథ్వీ అంబానీ 2020డిసెంబర్ లో జన్మించాడు. అతనికి ఇప్పుడు రెండేళ్లు. తాజాగా తమ కుటుంబంలోకి కొత్తగా మరొక ఫ్యామిలీ మెంబర్ రావడాన్ని అంబానీ ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకుంటున్నాయి.