సిద్ధివినాయక ఆలయంలో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ ప్రత్యేక పూజలు

సిద్ధివినాయక ఆలయంలో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ ప్రత్యేక పూజలు

ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుటుంబ సభ్యులతో కలిసి సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. గణపతి నవరాత్రుల సందర్భంగా భార్య నీతా అంబానీ, కుమారుడు అనంత్‌ అంబానీ, కుమార్తె ఈశాతో కలిసి ముకేశ్‌ అంబానీ ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని ఆదివారం (సెప్టెంబర్ 24న) సందర్శించారు. ఈ సందర్భంగా ఏకదంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడికి లడ్డూను నైవేద్యంగా సమర్పించారు.

Also Read : గూగుల్ మ్యాప్ రివ్యూస్ అంటే పార్ట్ టైం జాబ్.. రూ.3 లక్షలు కొట్టేసిన సైబర్ చీటర్స్

ఈ సందర్భంగా ఈశా కవల పిల్లలను స్వామి వారి పాదాల వద్ద ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అంబానీ కుటుంబ సభ్యులకు ఆలయ పూజారులు శాలువాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అంబానీ రాకతో ఆలయంలో కాసేపు భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.