
ప్రస్తుతం తెలుగులో మల్టీస్టారర్స్ గాలి వీస్తోంది. స్టార్ హీరోలు మొదలు యువ హీరోల వరకు మల్టీస్టారర్స్‌లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వరుసలో రానా ముందున్నాడు. ఓవైపు సోలో హీరోగా రాణిస్తూనే, మరోవైపు మల్టీస్టారర్స్‌లో నెగిటివ్ టచ్ ఉండే క్యారెక్టర్స్ కూడా పోషిస్తున్నాడు. ప్రభాస్‌తో ‘బాహుబలి’ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘భీమ్లానాయక్’లో నటిస్తున్నాడు రానా. ఆమధ్య తను హీరోగా నటించిన ‘అరణ్య’లోనూ విష్ణు విశాల్ మరో హీరోగా కనిపించాడు. ఇక ఇటీవల బాబాయి వెంకటేష్‌తో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌ని అనౌన్స్ చేశారు. తాజాగా రానా మరో మల్టీస్టారర్‌లో నటించేందుకు ఎస్ చెప్పినట్టు టాక్. ఓ కొత్త దర్శకుడు రూపొందించనున్న ఈ చిత్రంలో శర్వానంద్ మరో హీరోగా నటించనున్నాడట. సిద్ధార్థ్‌తో కలిసి శర్వా నటించిన ‘మహాసముద్రం’ అక్టోబర్ 14న రిలీజ్ కాబోతోంది. అంటే రానానే కాదు, శర్వా కూడా బ్యాక్ టు బ్యాక్ మల్టీ స్టారర్స్‌లో నటిస్తున్నట్టే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే ఈ చిత్రంలో ఇద్దరు హీరోల పాత్రలకీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందంటున్నారు. ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై అతి త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.