శిఖం భూములు ఆక్రమిస్తే కేసులు నమోదు చేయాలి

శిఖం భూములు ఆక్రమిస్తే కేసులు నమోదు చేయాలి

మంగపేట, వెలుగు: చెరువు శిఖం భూములను ఆక్రమిస్తే కేసులు నమోదు చేయాలని ములుగు కలెక్టర్​ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం మంగపేట మండలం మల్లూరు సమీపంలో ఉన్న అత్త, కోడలు చెరువులను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరువు శిఖం భూములను సర్వే చేసి, ఆక్రమించినట్లయితే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. 

అనంతరం తహసీల్​​కార్యాలయంలో కమలాపురం, మంగపేట గ్రామాల మధ్య గోదావరి తీరానికి నిర్మించే కరకట్టకు సంబంధించిన భూములు కోల్పోయే రైతులతో సమావేశమై మాట్లాడారు. భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని వివరించారు. కరకట్ట  రైతులు సహకరించాలని కోరారు. మంగపేటబోర్–నర్సాపురం గ్రామాల మధ్య ఇటీవల నిర్మించిన బ్రిడ్జ్ పరిశీలించారు.  అనంతరం మల్లూరు హేమాచల నృసింహస్వామికి కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.