మంగపేట పీఎస్ను ఎస్పీ తనిఖీ

మంగపేట పీఎస్ను ఎస్పీ తనిఖీ

మంగపేట, వెలుగు: ములుగు జిల్లా మంగపేట పోలీస్ స్టేషన్ ను బుధవారం ములుగు ఎస్పీ శబరీశ్​ తనిఖీ చేశారు. డ్యూటీ రికార్డ్, రిసెప్షన్, క్రైమ్ రికార్డ్ లను చెక్ చేసి, కేసుల పురోగతి, సిబ్బంది పని తీరును ఎస్సై టీవీఆర్ సూరిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రతి విషయాన్ని పరిశీలిస్తుండాలని సూచించారు. అనంతరం కమలాపురం బిల్ట్ ఇంటేక్​వెల్​ దగ్గర గోదావరి వరద ఉధృతి పరిశీలించారు. 

ఇంటేక్​వెల్​ వద్ద 82 అడుగుల నీటి మట్టంతో గోదావరి వరద ప్రవహిస్తుందని, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక చేశారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివమ్ ఉపాధ్యాయ, సీఐ అనుముల శ్రీనివాస్, సిబ్బంది తదితరులున్నారు.