సకల సౌలత్‌లతో తేజస్​ జర్నీ

సకల సౌలత్‌లతో తేజస్​ జర్నీ
  • తేజస్​ రెండో ప్రైవేట్‌ రైలు స్టార్ట్​..
  • అహ్మదాబాద్​- ముంబై మధ్య జర్నీ

రెండో తేజస్​ రైలు జర్నీ మొదలైంది. అహ్మదాబాద్​– ముంబై రూట్​లో నడిచే తేజస్​ రైలును శుక్రవారం రైల్వే మంత్రి పీయూష్​ గోయల్​, గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్​భాయి రూపానీలు ప్రారంభించారు. ఇనాగ్యురల్​ రన్​లో భాగంగా అహ్మదాబాద్​ నుంచి ముంబైకి, ముంబై నుంచి అహ్మదాబాద్​కు ట్రిప్పులు వెళ్లింది తేజస్​. ఆదివారం నుంచి రెగ్యులర్​గా రైలు పరుగులు పెట్టనుంది. ఒక్క గురువారం తప్ప వారంలో ఆరు రోజులు అది డ్యూటీలో ఉంటుంది. ఇక, దేశంలో ప్రైవేట్​ ఆధ్వర్యంలో నడుస్తున్న రెండో రైలిది. సకల సౌకర్యాలతో రైలును తీర్చిదిద్దారు. ఆ ఫొటోలను పీయూష్​ గోయల్​ ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. దేశ సంప్రదాయానికి తగ్గట్టు సిబ్బంది కట్టుబొట్టు ఉండనుంది. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు మోడర్న్​ లుక్​తో పాటు దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా రైలుకు రూపునిచ్చారు. కాఫీ వెండింగ్​ మెషీన్లు, బయో టాయిలెట్లు, అవసరమైనప్పుడు నీళ్లు కావాలంటే ఆర్​వో మెషీన్లు, ఒక్కో ప్రయాణికుడు తనకు అనుకూలంగా చదువుకునేందుకు రీడింగ్​ లైట్లు, మొబైల్​ చార్జింగ్​ పోర్టులు, సీసీటీవీ కెమెరాలు, ఎల్​ఈడీ టీవీలు, ఆటోమేటిక్​ డోర్స్​తో పాటు ఎన్నో సౌకర్యాలను ఐఆర్​సీటీసీ కల్పిస్తోంది.