అమ్మాయిని కాపాడిన ఆటో డ్రైవర్

అమ్మాయిని కాపాడిన ఆటో డ్రైవర్

పాల్ఘర్: ఇంటి నుంటి పారిపోయిన ఓ అమ్మాయిని ఓ ఆటో డ్రైవర్ మళ్లీ కన్నవారి చెంతకు చేర్చాడు. అమ్మానాన్నలపై అలిగిన ఆ బాలికను పోలీసుల సాయంతో ఇంటికి పంపాడు. మహారాష్ట్రకు చెందిన ఆ డ్రైవర్ చేసిన పనిని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు.
ఢిల్లీకి చెందిన 14 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. చదువుపై దృష్టి పెట్టకపోవడంతో శుక్రవారం నాడు తల్లి మందలించింది. అమ్మ కోప్పడటంతో అలిగిన ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయింది. ట్రైన్ ఎక్కి మహారాష్ట్రలోని వసాయ్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. స్టేషన్ బయట ఉన్న ఆటో డ్రైవర్ రాజు ఖర్వాడే వద్దకు వెళ్లి.. తాను ఉండేందుకు రూం ఏమైనా దొరుకుతుందా అని ఆరా తీసింది. ఒంటరిగా వచ్చిన ఆ అమ్మాయిని చూసి రాజుకు అనుమానం కలిగింది. ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. వెంటనే ఆ ఆటో డ్రైవర్ దగ్గరలో ఉన్న ట్రాఫిక్ పోలీసు దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు. అతని సూచన మేరకు ఆ అమ్మాయిని మాణిక్పూర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. సబ్ ఇన్స్ పెక్టర్ కు అమ్మాయి గురించి చెప్పాడు.
పోలీసుల విచారణలో బాలిక ఢిల్లీ పుష్ప్ విహార్లో ఉంటామని చెప్పడంతో మాణిక్పూర్ ఎస్సై ఢిల్లీలోని సాకేత్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాడు. అప్పటికే కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసిన బాలిక తల్లిదండ్రులకు అమ్మాయి ముంబైలో ఉన్నట్లు సాకేత్ పోలీసులు చెప్పారు. సమాచారం తెలిసిన వెంటనే ఆమె తల్లిదండ్రులకు ఫ్లైట్ లో వసాయ్కు చేరుకున్నారు. శనివారం సాయంత్రం పోలీసులు ఆ బాలికను పేరెంట్స్కు అప్పగించారు. అనంతరం ఆటో డ్రైవర్ రాజును సన్మానించారు.

మరిన్ని వార్తల కోసం..

మన టెకీలకు అమెరికా గుడ్ న్యూస్

ఐదు రాష్ట్రాల ఎన్నికలు: ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం