
ముంబైలో వింత వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భార్యలను మార్చుకుంటున్న కేసులో ఓ వ్యాపారవేత్తను పోలీసులు అరెస్టు చేశారు. సదరు వ్యాపారవేత్త భార్య తన భర్తతో పాటు మరో ముగ్గురిపై అమ్తా నగర్ పోలీస్‌స్టేషన్‌లో 2017లో ఫిర్యాదు చేసింది. ఇలా భార్య మార్పిడి జరిగినప్పుడు ఇతర నిందితుల భార్యలు కూడా ఈ వ్యవహారంలో పాలుపంచుకుంటున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు ఆ వ్యాపారవేత్తను అరెస్టు చేసి డిసెంబర్ 23 వరకు పోలీసు కస్టడీకి తరలించారు.
ఒకసారి వ్యాపారవేత్త భార్య తనకు ఇలా భార్య మార్పిడి వ్యవహారంలో పాల్గొనడం ఇష్టం లేదని చెప్పిందట. అయితే ఈ విషయం గురించి ఆమె తన కుటుంబ సభ్యులకు చెబుతుందేమోనని భయపడిన ఆ భర్త.. ఆమె ఒకసారి భార్య మార్పిడిలో పాల్గొన్నప్పుడు వీడియో తీశాడు. ఆ వీడియో చూపించి భార్య మార్పిడి గురించి ఆమె ఎవరికీ చెప్పకుండా ఆమెను బెదిరిస్తున్నాడు.
బాధితురాలి తరపు న్యాయవాది స్వప్నా కోడ్ మాట్లాడుతూ.. ‘ఈ వ్యవహారం నచ్చని బాధితురాలు భర్త నుంచి దూరంగా వెళ్లి తన తల్లితో కలిసి బతుకుతుంది. ఈ విషయం గురించి బాధితురాలు తన తల్లి మరియు చెల్లికి చెప్పింది. భార్య మార్పిడికి సహకరించే ఇతర జంటలను నిందితుడు ఎలా కలుసుకుంటున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నించగా అసలు విషయం బయటపడింది. అతను తన వాట్సాప్ గ్రూప్ మరియు సోషల్ మీడియా పోర్టల్స్‌తో ఇతర జంటలతో మాట్లాడి దీనికి పాల్పడుతున్నట్లు తెలిసింది’ అని తెలిపారు.
భాదితురాలి ఫిర్యాదుతో ఆమె భర్త మరియు మరో ముగ్గురిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
For More News..