
చైనా షేర్ మార్కెట్ స్కామర్లకు వారి సోషల్ మీడియా ఖాతాలను ఇచ్చిన నలుగురు వ్యక్తులను ముంబై వెస్ట్రన్ సైబర్ సెల్ అరెస్ట్ చేసింది. సైబర్ నేరగాళ్లు యాంకర్ల డీప్ ఫేక్ వీడియోలతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న బిజినెస్ యాంకర్ల డీపీలతో నకిలీ వీడియోలు సృష్టించి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో అప్ లోడ్‌చేసి షేర్ మార్కెట్లో పెట్టబడులు పెట్టేలా ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. బెంగళూరులో ముగ్గురిని, థానేలో ఒకరిని అరెస్టు చేశారు. కోర్టు వారిని అక్టోబర్ 20 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది.
సెబీలో రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ అయిన ప్రకాష్ గబా (73) ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ 29న కేసు నమోదు చేశారు సైబర్ పోలీసులు. దర్యాప్తులో ఫేక్ ఖాతాను అస్సాంకు చెందిన ఓ మహిళకు చెందినదని తేలింది. ఆమె బెంగళూరుకు చెందిన డిజిటల్ కంపెనీ వాల్యూలీఫ్‌లో పనిచేస్తోంది.2024లో ఉద్యోగాన్ని వదిలివేసింది. అయితే ఆమె ఖాతాలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తు తేలింది.
షేర్ మార్కెట్ స్కామ్..
దేశంలో అరెస్టు చేయబడిన మొట్టమొదటి షేర్ మార్కెట్ స్కామ్ ముఠా ఇది. 2025 ప్రారంభం నుంచి ఇప్పటివరకు షేర్ ట్రేడింగ్ మోసాలకు సంబంధించి సైబర్ పోలీసులకు 640 ఫిర్యాదులు అందాయి. ఈ స్కామ్ లో దాదాపు రూ.400 కోట్ల నష్టాలు వచ్చాయి.
సాధారణంగా ఎవరైనా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినప్పుడు డబ్బు వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి వారి డీమ్యాట్ ఖాతాకు బదిలీ అవుతుంది. అయితే ఈ మోసాలలో బాధితులకు సంబంధం లేని ఖాతాలకు డబ్బును బదిలీ చేయడం ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.