IPL 2024: ముంబై జట్టులోకి సౌరాష్ట్ర సంచలనం.. ఎవరీ హార్విక్ దేశాయ్‌?

IPL 2024: ముంబై జట్టులోకి సౌరాష్ట్ర సంచలనం.. ఎవరీ హార్విక్ దేశాయ్‌?

ఐపీఎల్ 2024 నుంచి మరో ముంబై ఇండియన్స్ బ్యాటర్ తప్పుకున్నాడు. యంగ్ ప్లేయర్ విష్ణు వినోద్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో సౌరాష్ట్ర వికెట్ కీపర్ బ్యాటర్ విష్ణు హార్విక్ దేశాయ్ ను ఎంపిక చేశారు. ఐపీఎల్ కు ముందు విష్ణు వినోద్ మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. స్కానింగ్ లో అతని గాయం తీవ్రం కావడంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఈ ఐపీఎల్ ఆడకుండానే వైదొలగాల్సి వచ్చింది.       

హార్విక్ దేశాయ్ సౌరాష్ట్ర వికెట్ కీపర్. అతను 26 ఫిబ్రవరి 2017లో విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్ర తరపున లిస్ట్ A క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.  ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కారణంగా 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫైనల్లో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇప్పటివరకు 27 టీ20 మ్యాచ్ ల్లో 30 యావరేజ్ తో 691 పరుగులు చేశాడు. అతని ఖాతాలో ఒక సెంచరీతో పాటు 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారీ హిట్టింగ్ తో పాటు పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం ఇతని స్పెషాలిటీ. నిరుడు స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సౌరాష్ట్ర త‌రఫున‌ ఈ చిచ్చ‌ర‌పిడుగు ఓ రేంజ్‌లో ఆడాడు. 175 స్ట్రయిక్ రేటుతో ఏకంగా 336 ర‌న్స్ సాధించాడు.

ఒక్క ఛాన్స్ వస్తే తనను తాను నిరూపించుకోవడాని సిద్ధంగా ఉన్నాడు. వికెట్ కీపర్, బ్యాటర్ గా ముంబై జట్టులో చేరిన హార్విక్.. తుది  జట్టులో స్థానం దాదాపు అసాధ్యం.  ప్రస్తుతం ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ బ్యాటర్ గా ఇషాన్ కిషాన్ కొనసాగుతున్నాడు. ఒకవేళ కిషాన్ గాయం కారణంగా తప్పుకోవాల్సి వస్తే హార్విక్ కు తుది జట్టులో స్థానం దక్కే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత సీజన్ లో ముంబై ఇప్పటివరకు 4 మ్యాచ్ లాడితే ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది.