
ఐపీఎల్‌కు పొలార్డ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు మంగళవారం ట్విటర్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్లో ముంబై జట్టుకు ఆడటం గర్వంగా ఉందని పొలార్డ్ ట్వీట్ చేశాడు. అయితే ఎంఐ జట్టుకు గుడ్ బై చెప్పడం బాధగా ఉందన్నాడు. కొన్నాళ్లు ఆడాలని అనుకున్నట్లు..అయితే ఫాం లేమి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఐపీఎల్లో ముంబైకు తప్ప మరో జట్టుకు ఆడాలనుకోవడం లేదని..ముంబై ఇండియన్ టీమ్ ప్లేయర్‌గానే రిటైర్ అవ్వాలనుకున్నానని చెప్పుకొచ్చాడు. లాగే బ్యాటింగ్ కోచ్‌గా, ముంబై ఎమిరేట్స్ ప్లేయర్‌గా ఎంఐ ఫ్యామిలీతో అనుబంధం కొనసాగుతుందన్నాడు. ఐపీఎల్ కెరీర్లో సహకరించిన ఫ్రాంచైజీ, కోచింగ్ స్టాఫ్, సహచర ఆటగాళ్లకు పొలార్డ్ ధన్యవాదాలు తెలిపాడు. తన ఫ్రెండ్స్, కుటుంబసభ్యులకు ధన్యవాదాలు అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
https://twitter.com/KieronPollard55/status/1592430332443209728
ముంబై విజయాల్లో కీ రోల్..
ఐపీఎల్లో ఆది నుంచి పొలార్డ్ ముంబై తరపునే ఆడుతున్నాడు. 2010 నుంచి ముంబై జట్టు సభ్యుడిగా ఉన్న పొలార్డ్..ఆ జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. తన ఐపీఎల్ కెరీర్లో పొలార్డ్..171 ఇన్నింగ్స్ లలో 28.67 సగటుతో 3412 పరుగులు చేశాడు. ఇందులో 16 హాఫ్ సెంచరీలున్నాయి. అటు బౌలింగ్ లోనూ 69 వికెట్లు పడగొట్టాడు. 103 క్యాచులతో బెస్ట్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ అత్యధిక సార్లు టైటిల్ విజేతగా నిలవగా.. ఈ విజయాల్లో పొలార్డ్ కీ రోల్ ప్లే చేశాడు.
పేలవ ప్రదర్శన
పదేళ్ల పాటు ముంబై జట్టు ప్లేయర్‌గా కొనసాగిన పొలార్డ్..గత సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. 2022 ఐపీఎల్లో అతని టాప్ స్కోర్ 25 మాత్రమే. భారీ షాట్లు ఆడటంలోవిఫలమైన పొలార్డ్ ...జట్టుకు భారంగా మారాడు. ఈ నేపథ్యంలో పొలార్డ్‌ను వచ్చే సీజన్‌కు వదులుకోవలని ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై ఎంఐ అధికారిక ప్రకటన చేయడం కంటే ముందే పొలార్డ్ ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పాడు.