అత్యవసర సేవల కోసం లోకల్ ట్రైన్లు షురూ

అత్యవసర సేవల కోసం లోకల్ ట్రైన్లు షురూ

ముంబై: ఉద్యోగుల సౌకర్యార్థం ముంబై సిటీలో లోకల్ ట్రైన్స్(సబర్బన్ రైళ్లు) నేటి నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. అత్యవసర సిబ్బందికి మాత్రమే మెయిన్ లైన్, హార్బర్ లైన్ ద్వారా ‘సెలెక్టివ్ సబర్బన్ సర్వీసెస్’ నడపాలని నిర్ణయించినట్లు వెస్ట్రన్ రైల్వే సీనియర్ అధికారి సోమవారం ట్వీట్ చేశారు. ప్రభుత్వం గుర్తించిన ఎసెన్షియల్ స్టాఫ్ అసౌకర్యాన్ని నివారించేందుకు లోకల్ రైళ్లు నడుపుతున్నామని తెలిపారు. ఉద్యోగులకు ఐడీ కార్డుల ద్వారా స్టేషన్లలోకి ప్రవేశం కల్పిస్తామన్నారు. ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు రైళ్లు నడుస్తాయని తెలిపారు. అయితే, ఈ రైళ్లలో సాధారణ ప్రయాణికులకు అనుమతి లేదని, స్టేషన్లకు రాకూడదని ప్రకటనలో తెలిపారు.