సోషల్ మీడియాలో పరిచయం.. బాలికపై అత్యాచారం చేశాడు..

సోషల్ మీడియాలో పరిచయం.. బాలికపై అత్యాచారం చేశాడు..

ఓపక్క..ఆందోళనలు..స్కూల్ స్వీపర్ ఇద్దరు కిండర్ గార్డెన్ చిన్నారుపై లైంగిక వేధింపుల ఘటనలపై నిరసనలు , ఆందోళనలు ముంబై అంతటా హోరెత్తు తున్నా యి. రైళ్ల రాకపోకలు నిలిచాయి.. పోలీస్ లాఠీ ఛార్జీలు, బంద్ లు జరుగుతున్నాయి.. మరోవైపు ఓ మైనర్ బాలికను ట్రాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 

సోషల్ మీడియాలో పరిచయం.. మైనర్ కు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం..విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం లో వెలుగులోకి వచ్చింది.. ముంబైలో జరిగిన మరో అత్యాచార ఘటన.. ఈ కేసులో నిందితుడిని గోరేగావ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

హోటల్ పనిచేసే 21యేళ్ల యువకుడు..చదువుకుంటున్న 13 ఏళ్ల బాలిక..ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం.. సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మాయ మాటల తో  మైనర్ ను బుట్టలో వేసుకున్నాడు యువకుడు. తన ఊరికి తీసుకెళ్లాడు.. పలుమార్లు అత్యాచారం చేశాడు. 

ఆగస్టు 5న ఇంటి నుంచి వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో.. తల్లిదండ్రులు కంగారు పడ్డారు.. ఎంత వెదికినా ఆచూకీ మాత్రం లభించలేదు.. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి. తనంతట తానుగా ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె తిరిగి వచ్చినప్పుడు మౌనంగా ఉంది.. కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించారు.. దీంతో ఒక్కసారిగా ఉప్పొంగిన కన్నీళ్లతో తన బాధను చెప్పింది. 

అత్యాచారం విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. ఇన్ స్టాగ్రామ్ నుంచి నిందితుడి ఫొటోలను సేకరించారు. సమీపంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవల మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్ పాఠశాల ఘటన.. ఇద్దరు కిండర్ గార్డెన్ బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలో భారీ నిరసనలు , ఆందోళనలు జరుగుతున్న క్రమంలో  ఈఘటన అక్కడి దారుణ పరిస్థితిని చూపెడుతోంది. 

బద్లాపూర్ లో ఘటనపై ముంబైతో పాటు మహారాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.  బద్లాపూర్ సహా ఇతర ప్రాంతాల్లో నిరసన కారులు పోలీసులపై రాళ్ల దాడులు చేశారు. ఈ ఘటనలో 17 సిటీపోలీసులు, 8మంది రైల్వే పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఘటన జరిగిన పాఠశాల బద్లాపూర్ కు  చెందిన బీజేపీ నేత బంధువుని అందుకే వారిని రక్షించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన కారులు చెబుతున్నారు.