
డెలివరీ బాయ్‌ల జీవితాలను మెరుగుపరిచేందుకు డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ముంబై రోడ్లపైకి వచ్చారు. ముంబయిలోని కుర్లా ఈస్ట్‌లో వారి కోసం రిలాక్స్ స్టేషన్ అనే స్టాప్-బై స్పాట్ ను అందుబాటులోకి తీసుకువచ్చి సిద్ధేష్ లోకారే వార్తల్లో నిలిచారు. కస్టమర్ల ఆర్డర్‌లను నగరం అంతటా వారికి చేరేలా చేయడానికి అవిశ్రాంతంగా పని చేస్తోన్న డెలివరీ ఏజెంట్లకు రిఫ్రెష్‌మెంట్ పొందేందుకు దీన్ని తీసుకువచ్చారు.
సిద్ధేష్ రిలాక్స్ స్టేషన్‌కు డెలివరీ ఏజెంట్లను స్వాగతిస్తున్నట్లు కనిపించే ఓ రీల్ ను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. చాలా మంది ఆహారం, టీ కోసం అక్కడ ఆగిపోయినట్లు ఇందులో కనిపిస్తోంది. “నేను భారతదేశంలోని నిజమైన హీరోల కోసం రిలాక్స్ స్టేషన్‌ని స్థాపించాను. ఈ రిలాక్స్ స్టేషన్ మా డెలివరీ పర్సన్స్ కోసం” అని ఇన్‌స్టాగ్రామర్ వీడియోకు క్యాప్షన్ గా రాసుకువచ్చారు. Re
సిద్ధేష్..సమోసాలు, చాయ్‌తో పాటు వాటర్ బాటిళ్లు, అవసరమైన వారికి రెయిన్‌కోట్‌లు కూడా.. కొంతమంది డెలివరీ బాయ్‌లకు అందించారు. స్టాల్ మొబైల్ అని నగరంలోని 1-2 స్పాట్‌లలో నిర్దిష్ట సమయం వరకు మాత్రమే ఇది ఉంచినట్టు తెలుస్తోంది
ఇంటర్నెట్‌లో ఈ వీడియో వైరల్ కావడంతో సిద్దేష్ పై పలువురు ప్రశంసలు కురిపించారు. ఇది చాలా మందికి స్ఫూర్తిని కూడా ఇచ్చింది. "అది చాలా మధురమైనది! నేను ఏదైనా సహాయం చేయగలనా?" ఒక యూజర్ అడగ్గా "గ్రేట్ జాబ్ బడ్డీ" మరొకరు రాసుకువచ్చారు.