వైరల్ వీడియో: బర్త్ డే రోజు 550 కేక్‎ల కట్

V6 Velugu Posted on Oct 13, 2021

ముంబై: ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజును గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటారు. అందుకోసం తమ స్నేహితులను, దగ్గరివాళ్లను పిలుచుకొని వేడుకలు చేసుకుంటారు. తమతమ స్థోమతకు తగ్గట్లు పార్టీలు ఇస్తూ.. కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. బర్త్ డే రోజు కేక్ కట్ చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణం. కానీ, ముంబైకి చెందిన ఓ వ్యక్తి మాత్రం తన పుట్టినరోజు సందర్భంగా ఏకంగా 550 కేకులు కట్ చేశాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కాండీవలికి చెందిన సూర్య రాతురి అనే వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా 550 కేకులను కట్ చేశాడు. సూర్య కేక్ లను కట్ చేస్తుండగా.. అతని స్నేహితులు, బంధువులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మూడు టేబుల్స్ మీద 550 కేకులను వరసగా అమర్చగా.. సూర్య రెండు చేతులలోకి రెండు కత్తులను తీసుకొని.. వరుసగా కట్ చేస్తూ వెళ్లాడు. అతని స్నేహితులు చప్పట్లతో సూర్యను ఎంకరేజ్ చేశారు. 

ఇటువంటి వింత పుట్టినరోజు వేడుకలు తరచుగా వార్తల్లో వస్తుంటాయి. గత ఏడాది అక్టోబర్‌లో కత్తితో కేక్‌లను కత్తిరించిన యువకుడిని నాగపూర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా.. ఉత్తర ప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలోని ఒక వ్యక్తి 2019లో పుట్టినరోజు కేక్‌ మీద కాల్పులు జరిపాడు. ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్ అయింది. దాంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

For More News..

హుజూరాబాద్ బైపోల్.. బరి నుంచి 12 మంది విత్ డ్రా..

ఈ పాస్‎వర్డ్‎లు వాడితే ఈజీగా హ్యాక్ అవుతారు

Tagged Mumbai, BirthDay, Birthday Celebrations, cake cutting, Kandivali, Surya Raturi

Latest Videos

Subscribe Now

More News