
ముంబై లాల్ బాగ్ కర్రీ రోడ్‌లోని అవిగ్న అపార్ట్ మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 19వ ఫ్లోర్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పరిసర ప్రాంతాల్లో పొగలు దట్టంగా అలుముకున్నాయి. దీంతో బిల్డింగ్‌లోని ప్రజలు ఆందోళనతో బయటకు పరుగులు తీశారు. మంటల భయానికి ఓ వ్యక్తి పందోమ్మిదో ఫ్లోర్ నుంచి కిందకు దూకాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలాన్ని ముంబై మేయర్ కిశోరి పడ్నేకర్ పరిశీలించారు. ఫైర్ సేఫ్టి సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.