రైలు ఎక్కబోతూ కిందపడిన మహిళ.. కాపాడిన లేడీ కానిస్టేబుల్

రైలు ఎక్కబోతూ కిందపడిన మహిళ.. కాపాడిన లేడీ కానిస్టేబుల్

ముంబై: రన్నింగ్ రైలు ఎక్కడం లేదా దిగటం ఎంత ప్రమాదకరమో తెలిసిందే. కదిలే రైలు ఎక్కేప్పుడు, దిగేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రన్నింగ్ రైలును ఎక్కబోతూ లదా దిగబోతూ పలువరు ప్రమాదానికి గురయ్యారు. అయితే రైల్వే పోలీసులు వేగంగా స్పందించి బాధితులను కాపాడిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ముంబైలోని శాండ్‌హార్స్ట్‌ రోడ్డు స్టేషన్‌లో చోటు చేసుకుంది. కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న ఓ 50 ఏళ్ల మహిళ కాలుజారి రైలు కింద పడిపోతుండగా.. దగ్గర్లో ఉన్న ఫిమేల్ కానిస్టేబుల్ సప్నా గోల్‌కర్ వెంటనే పరిగెత్తి ఆమెను బయటకు లాగింది. ఒకవేళ లేడీ కానిస్టేబుల్ సమయానికి స్పందించి వెళ్లకపోయుంటే ఆ మహిళ ప్లాట్‌ఫామ్ నుంచి జారి రైలు కింద పడిపోయి ఉండేది. సీసీటీవీల్లో రికార్డ్ అయిన ఈ వీడియోను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఇండియా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. సాహసాన్ని ప్రదర్శించి మహిళను కాపాడిన కానిస్టేబుల్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు.  

మరిన్ని వార్తల కోసం: 

టార్గెట్ ఈటల.. అందుకే ఇంత డబ్బు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రోగానికి ఉన్నోళ్లు లేనోళ్లని తేడాలేదు: ప్రధాని మోడీ

హరీశ్‌ లేకుండానే మెదక్‌ జిల్లా రివ్యూ