మూతపడ్డ ముంబై మిర్రర్, పుణే మిర్రర్

మూతపడ్డ ముంబై మిర్రర్, పుణే మిర్రర్

ఎంతో మంది పాఠకుల ఆదరణ పొందిన టాబ్లాయిడ్‌ డైలీ న్యూస్ పేపర్లు ‘ముంబై మిర్రర్‌’, ‘పుణే మిర్రర్‌’ డిసెంబర్‌ 5వ తేదీ, శనివారం నాటి సంచికతో సెలవు తీసుకున్నాయి. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతినడంతో వీటిని మూసివేయక తప్పలేదని ‘టైమ్స్‌ గ్రూప్‌’ ప్రకటించింది. ఇక నుంచి ముంబై మిర్రర్‌ను వార పత్రికగా మారుస్తామని, ఆన్‌లైన్‌ పత్రిక ఎప్పటిలాగా కొనసాగుతుందని తెలిపింది.

కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఏడాది కాలంలోనే ముంబై నగరంలో మూడు ఇంగ్లీష్ పేపర్లు మూత పడ్డాయి. ‘ది ఆఫ్టర్‌నూన్‌ డిస్పాచ్‌ అండ్‌ కొరియర్‌’ 2019, జూలై నెలలో మూతపడగా, డీఎన్‌ఏ పత్రిక 2019, అక్టోబర్‌ నెలలో మూత పడింది. ఈ పత్రికల మూతతో ఎన్నో మంది జర్నలిస్టులు రోడ్డున పడ్డారు.