ముంబై నార్త్ బెర్త్ ఎవరికి.?

ముంబై నార్త్ బెర్త్ ఎవరికి.?

బీజేపీకి మంచి పట్టున్ననియోజక వర్గం ముంబై నార్త్ . గత ఎన్నికల్లో ఆ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచిన సెగ్మెంట్లలో ఇదీ ఒకటి. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగి పలుమార్లు ఎమ్మెల్యే గా గెలిచిన గోపాల్ శెట్టి, 2014లో 4.47 లక్షలఓట్ల తేడాతో గెలిచారు. కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్​ నిరుపమ్‌ను చిత్తుచిత్తుగా ఓడించారు.తాజా ఎన్నికల్లోనూ శెట్టి గెలుపు నల్లేరు మీద నడకేనని పొలిటికల్ ఎక్స్​పర్టులు అంచనా వేశారు.అయితే కాంగ్రెస్ నుంచి సినీ నటి ఊర్మిళ మటోంద్కర్ ను నిలబెట్టాక సీన్ రివర్స్​అయింది. సమీకరణాలు మారాయి. కాంగ్రెస్ పోటీలోకి వచ్చింది.ఇప్పుడు రెండు పార్టీలకు సమాన విజయావకాశాలు ఉన్నాయి. ముంబై నార్త్ సెగ్మెంట్​లో పార్టీల బలాబలాలపై ఓ లుక్ వేస్తే…

ముంబై నార్త్ సీటులోని అసెంబ్లీ సెగ్మెంట్లు

మాగథానె, ఛార్కోప్ , కాండి వలి ఈస్ట్‌‌, మలాడ్వె స్ట్‌‌, బోరివలి, దహిసర్. దహిసర్, బోరివలి,కాందీవలి ఈస్ట్‌‌, ఛార్కోప్ సెగ్మెంట్లలో బీజేపీ గెలిచిం ది. మాగథానెలో శివసేన, మలాడ్ వెస్ట్‌‌లోకాంగ్రెస్ గెలిచాయి.

ప్రధాన సమస్యలు

జనాభా పెరుగుదల, హౌసింగ్ , హెల్త్, రవాణా.సంజయ్ గాం ధీ నేషనల్ పార్కులో ఏర్పాటు చేసిన ఆదివాసీ జనావాసాల్లో వసతుల కొరత.

కాంగ్రెస్ ధీమా ఇలా..

2.5 లక్షల సాంప్రదాయ ఓట్లు ఉన్నాయి. ఊర్మిళకు ఉన్న గుడ్​విల్  వల్ల ఓట్లు పెరుగుతాయి.ముంబైలో ప్రభావం చూపగల మహారాష్ర్ట నవనిర్మాణ్ సేన మద్దతు కూడా ఉంది. 1.15 లక్షల ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు కూడా ఊర్మిళకు పడుతాయని అంచనా. ఇక 6.5 లక్షల మంది మహారాష్ట్రీయులు, 5.5 లక్షల మంది గుజరాత్ మాట్లాడేవారు ఉన్నారు. ఈ 12 లక్షల ఓట్లలో 7 నుంచి 8శాతం ఓట్లు పడినా , గెలుపు అవకాశాలు పెరుగుతాయని కాంగ్రెస్ భావిస్తోంది.

బీజేపీ ధీమా ఇది..

గోపాల్ శెట్టి అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన విషయాన్ని కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు.బోరివలి ప్రాంతంలో ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థి పార్టీల నేతలు గతంలో మెచ్చుకున్నారు.