బాలీవుడ్ న‌టుడి కొడుకుపై రేప్ కేసు న‌మోదు

బాలీవుడ్ న‌టుడి కొడుకుపై రేప్ కేసు న‌మోదు

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మిథున్ చక్రవర్తి కొడుకు మహాక్షయ చక్రవర్తి పై లైంగికదాడి కేసు నమోదైంది. మహాక్షయ చక్రవర్తి త‌న‌ను మోసం చేశాడంటూ ఓ మోడల్ ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. మిథున్ చక్రవర్తి భార్య యోగితా బాలిపై కూడా ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

మహాక్షయ వివాహం తనను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి మోసం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. నాలుగేళ్ల సహజీవనం త‌ర్వాత‌.. త‌న‌ను శారీరకంగా, మానసికంగా అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. గర్భం దాల్చడంతో బలవంతంగా తనకు అబార్షన్‌ చేయించారని, కేసు పెడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని మహాక్షయ తల్లి యోగితా బాలి కూడా తనను బెదిరించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహాక్షయ, అతని తల్లిపై సెక్షన్ 376 (2) (ఎన్), 328, 417, 506, 313, 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఓషివారా పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ దయానంద్ బంగర్ తెలిపారు.