నోట్ల వర్షం : ఈ గణేష్ మండపంలో రోజుకు 50 లక్షల విరాళం

నోట్ల వర్షం : ఈ గణేష్ మండపంలో రోజుకు 50 లక్షల విరాళం

గణపతి నవరాత్రిళ్లు దేశ వ్యాప్తంగా అత్యంత వైభవంగా సాగుతున్నాయి.  ప్రతి గల్లీలో ఆదిదేవునికి భక్తులు పూజలు చేసి మొక్కులను  విరాళాల  రూపంలో సమర్పిస్తున్నారు.  అయితే మంబైలోని లాల్ బాగ్చా  రాజా వీధిలో  గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ స్వామిని దర్శించుకున్న భక్తులు మూడు రోజుల్లో కోటి 59 లక్షల12 వేల రూపాయిలు  విరాళాలు సమర్పించారు. అంతే కాదు గణపతి విగ్రహానికి 879.53 గ్రాముల బంగారం, 17,534 గ్రాముల వెండి విరాళంగా లభించింది. నవరాత్రిళ్లలో రెండో రోజున   60 లక్షల 62వేల రూపాయిలను భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. 

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో  లాల్‌బౌగ్చారాజాలో  వినాయక నవరాత్రిళ్లు 1934 నుంచి జరుగుతున్నాయి.  ఇది పుత్‌లబాయి చాల్‌లో ఏర్పాటు చేశారు.  పదిరోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి.  ఈ వినాయకమండపాన్ని ప్రముఖులు, రాజకీయనాయకులు, వ్యాపార వేత్తలు దర్శించుకుంటారు.  ఇది ముంబైలోని పురాతన మండపాల్లో అత్యంత ప్రసిద్ది చెందింది.  శుక్రవారం ( సెప్టెంబర్ 22)  రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన కుటుంబ సమేతంగా లాల్‌బాగ్చా రాజాను సందర్శించి గణేశుడి ఆశీస్సులు పొందారు. . పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం చతుర్థి తిథితో ప్రారంభమై అనంత చతుర్దశి నాడు ముగుస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.