ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిర్మల్,వెలుగు: నిర్మల్​లో రాష్ట్రస్థాయి క్రీడా పోటీల నిర్వహణకు మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి సహకారం తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తెలిపారు. శనివారం స్థానిక రవి హైస్కూల్​లో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నీ ముగింపు కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ఇకనుంచి ఏటా పోటీలు నిర్వహిస్తామన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టోర్నీ ఆర్గనైజర్, రవి స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ రామగోని తులసి నర్సాగౌడ్,  పీఈటీలు శ్రీనివాస్, భోజన్న, భూమన్న, అంబాజీ, డేవిడ్, వాలీబాల్ కోచ్ మొహినొద్దీన్​తదితరులు ఉన్నారు.

రైతులు అధైర్య పడొద్దు
నిర్మల్,వెలుగు: జిల్లాలోని బీరవెల్లి గ్రామంలో రైతు సేవా పరస్పర సహాయ సహకార పొదుపు పరపతి సంఘం (మ్యాక్స్)లో జరిగిన దొంగతనంతో రైతులు అధైర్య పడద్దని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. శనివారం మంత్రి సంఘ కార్యాలయాన్ని సందర్శించారు. ఇటీవల మ్యాక్స్​ఆఫీస్​లో రూ.10 లక్షలను దొంగలు ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న మంత్రి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. కొద్దిరోజుల్లోనే పోలీసులు దొంగలను పట్టుకుంటారని భరోసా ఇచ్చారు. మంత్రి వెంట టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రామచందర్, కోఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు. అనంతరం మంత్రి ఇటీవల అనారోగ్యానికి గురైన మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ సతీమణి కమలను పరామర్శించారు. దిలావర్​పూర్​కోడె నవీన్ సతీమణి ఇటీవల చనిపోగా ఆయన కుటుంబాన్ని పలకరించారు. నిర్మల్​జిల్లా హాస్పిటల్​ను మంత్రి సందర్శించారు. రోగులతో మాట్లాడారు.


జనవాసాల్లో సీవేజ్​ ప్లాంట్​ ఏర్పాటు వద్దు
రామకృష్ణాపూర్,వెలుగు: మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే1 మార్కెట్​ఏరియా(ఐదో వార్డు)లో మురుగునీటి శుద్ధి ప్లాంట్ (సెప్టిక్​ సీవేజ్​ ట్రీట్మెంట్ ప్లాంట్) ఏర్పాటు వద్దని స్థానికులు శనివారం ఆఫీసర్లను అడ్డుకున్నారు. కాలనీని ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 148లో ప్లాంట్​ ఏర్పాటు కోసం ట్రాక్టర్​తో చదును చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ప్లాంట్​ఏర్పాటుతో ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల అభ్యంతరంతో మున్సిపల్​ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

ఆజాద్ కేసు వచ్చేనెల 5కు వాయిదా
ఆదిలాబాద్,వెలుగు: మావోయిస్టు అగ్రనేత ఆజాద్ ఎన్‌‌కౌంటర్ కేసు వచ్చేనెల 5కు వాయిదా పడింది. కేసుకు సంబంధించి శనివారం పోలీసులు, సీబీఐ తరఫు న్యాయవాదులు ఆదిలాబాద్​కోర్టులో వాదనలు వినిపించారు. పోలీసులు హైకోర్టు నుంచి తీసుకొచ్చిన ఆర్డర్స్ ద్వారా వాదనలు ముగిసాయని, వచ్చేనెల 5న ఫైనల్​గా తమ వాదనలు వినిపిస్తామని ఆజాద్ తరఫు న్యాయవాది సురేశ్​ తెలిపారు.

వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
ఆదిలాబాద్,వెలుగు: చదువుల్లో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్  సూచించారు. శనివారం యాపల్ గూడ గ్రామంలోని పాఠశాలను సందర్శించి  బోధన వివరాలు తెలుసుకున్నారు. తొలిమె ట్టు కార్యక్రమాన్ని ఈనెల 31 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బోధన అనంతరం పిల్లల సామర్థ్యం తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈవో ప్రణీత, సెక్టోరియల్ అధికారి నర్సయ్య, ఎండీపీవో శివలాల్, సర్పంచ్ పెందూర్ గంగారం తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్ట్​ కార్మికులకు ఏరియర్స్ ఇయ్యాలె
రామకృష్ణాపూర్/బెల్లంపల్లి,వెలుగు:సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికులకు 19 నెలలుగా ఏరియర్స్​ఇవ్వడంలేదని ఇఫ్ట్​అనుబంధ  సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డి.బ్రహ్మాహ్మనందం విమర్శించారు. శనివారం మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్  సివిల్ ఆఫీస్ ఎదుట ఏరియర్స్, సీఎంపీఎఫ్​ స్లిప్పులు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ ధర్నా నిర్వహించారు. నిరసనలో లీడర్లు గజ్జి మల్లేశ్, నడిగుట్ట శంకర్, ప్రభాకర్, శ్రీను, రాజన్న, అప్పారావు, శ్రీనివాసరెడ్డి, మహేశ్, మహేందర్, నరేశ్, పర్వతాలు, సంతోష్, శంకర్, రాణి, నర్సమ్మ, నాగలక్ష్మి,  బెల్లంపల్లిలో ఐఎఫ్ టీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చాంద్ పాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్, లీడర్లు కృష్ణవేణి, పద్మ, శ్యామ్, వెంకటి, అబ్దుల్లా, రాములు, సునీత, గణేశ్, కొమురయ్య, రవి, శ్రీను, వేణు, లింగన్న, సురేశ్​ తదితరులు పాల్గొన్నారు.

కొత్తమద్దిపడగ దగ్గర ఆర్​ అండ్​ ఆర్​ కాలనీ
కడెం,వెలుగు: కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్ట్​పునరావాసంపై ఆఫీసర్లు చర్యలు ప్రారంభించారు. శనివారం మైసంపేట గ్రామంలో కలెక్టర్ ముషారఫ్​అలీ ఫారూఖీ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలోని 94 కుటుంబాల అభిప్రాయం మేరకు ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూమి ఎంపిక చేపట్టారు. త్వరలోనే కొత్తమద్దిపడగ గ్రామ శివారులో ఇండ్లు నిర్మించి అన్ని వసతులు కల్పిస్తామని కలెక్టర్​తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కాడే, ఎంపీడీవో సునీల్ హీరావత్, ఎఫ్ ఆర్ వో అనీత, ఆయాశాఖల ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీలో పలువురి చేరిక
ఆదిలాబాద్,వెలుగు: ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవా భవన్ లో ఎన్​ఆర్​ఐ, బీజేపీ లీడర్​ కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మాండగ, పందిలొద్ది గ్రామానికి చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. అనంతరం అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. 

కొలాం ప్రజలఅభివృద్ధికి చర్యలు
ఆసిఫాబాద్,వెలుగు: కొలాంల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కుమరం సూరు 25 వ వర్ధంతి సందర్భంగా ఆసిఫాబాద్​ఆదివాసీ భవన్​లో నిర్వహించిన ఉత్సవాలకు ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, జడ్పీ చైర్​పర్సన్​కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి కలెక్టర్​మాట్లాడారు.​ ఆదివాసీ తెగల్లో కొలాంలో విద్యాభివృద్ధికి కృషిచేస్తామన్నారు. ఆదివాసీ గిరిజనుల పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో డీటీడీవో మణెమ్మ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు, సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, లీడర్లు ఆత్రం లక్ష్మణ్, గంగారం, భీంరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు ఆహార భద్రత కల్పించాలి
మంచిర్యాల, వెలుగు: ప్రజలకు ఆహార భద్రత కల్పించడంలో అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాలని అడిషనల్​ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్​లో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రజలకు, స్కూళ్లకు, హాస్టళ్లకు, అంగన్​వాడీ సెంటర్లకు నాణ్యమైన బియ్యం సప్లై చేయాలన్నారు. ఆహార భద్రత చట్టం- 2013పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేసి సోషల్ ఆడిట్ చేయాలని, రేషన్​ షాపులను తనిఖీ చేయాలని అన్నారు. ప్రపంచ ఆహార దినోత్సవంపై నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన స్టూడెంట్లకు బహుమతులు అందజేశారు. డీఎస్​డీవో ప్రేమ్​కుమార్​, డీఆర్డీవో శేషాద్రి, డీఈవో వెంకటేశ్వర్లు, డీపీవో నారాయణరావు, ఆర్డీవోలు శ్యామలాదేవి, వేణు పాల్గొన్నారు.

బేస్ బాల్ లో సత్తా చాటాలి
కాగజ్ నగర్,వెలుగు: క్రీడాకారులు బేస్​పాల్​పోటీల్లో సత్తాచాటాలని జూనియర్ సాఫ్ట్​బేస్ బాల్ రాష్ట్ర అధ్యక్షురాలు డొక్టర్​కొత్తపల్లి అనిత కోరారు. కాగజ్ నగర్ ఎస్పీఎం గ్రౌండ్ లో శనివారం ట్రయల్స్​ను ఆమె  ప్రారంభించారు. గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్టేట్ జనరల్ సెక్రటరీ దుర్గం గురువేందర్, ట్రెజరర్​అర్జున్, జిల్లా కార్యదర్శి బద్రి, వైస్ ప్రెసిడెంట్ కొండా నాందేవ్, జగిత్యాల, వరంగల్, మంచిర్యాల జిల్లాల కార్యదర్శలు మహేశ్, కుమార్,​ షర్మిల తదితరులు ఉన్నారు.

పేద విద్యార్థులను ప్రోత్సహించడమే ధ్యేయం 

మంచిర్యాల, వెలుగు: పేద విద్యార్థులను చదువులో ప్రోత్సహించడమే రఘునాథ్​ వెరబెల్లి ఫౌండేషన్​ ధ్యేయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు అన్నారు. హాజీపూర్​ మండలం సబ్బెపెల్లి, దొనబండ స్కూళ్లలోని విద్యార్థులకు శనివారం స్కూల్​ కిట్లు అందజేశారు. గవర్నమెంట్​ స్కూళ్లలో చదువుతున్న టెన్త్​ విద్యార్థులకు ప్రతి సంవత్సరం బ్యాగులు, బుక్స్​తో స్కూల్​ కిట్లు అందజేస్తున్నామని చెప్పారు. చిగురు కార్యక్రమం ద్వారా విద్యార్థులోని ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తామన్నారు. ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా స్టూడెంట్లకు స్కూల్​ కిట్లు అందించామన్నారు. టెన్త్​లో 10 జీపీఏ సాధించిన వారిని ఫ్రీగా ఇంటర్​ చదివిస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ మండల అధ్యక్షుడు బొలిశెట్టి తిరుపతి, నాయకులు మాధవరపు వెంకటరమణారావు, మోటపలుకుల తిరుపతి, మడిపెల్లి సత్యం, అరెందుల రాజేష్, మారు వెంకట్​రెడ్డి, హనుమండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.  

కాంట్రాక్ట్​ డాక్టర్ల ఎంపికకు ఇంటర్వ్యూలు
మంచిర్యాల, వెలుగు:  వైద్యవిధాన పరిషత్​ పరిధిలోని బెల్లంపల్లి, చెన్నూర్​ కమ్యూనిటీ హెల్త్​ సెంటర్లలో కాంట్రాక్ట్​ డాక్టర్​ పోస్టుల ఎంపికకు ఈ నెల 20న ఉదయం 10.30 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు కలెక్టర్​ భారతి హోళికేరి తెలిపారు. బెల్లంపల్లి సీహెచ్​సీలో సివిల్​ అసిస్టెంట్​ సర్జన్స్​ స్పెషలిస్ట్స్​ (పిడియాట్రిషియన్​, గైనకాలజిస్ట్​, పల్మొనాలజిస్ట్​), సివిల్​ అసిస్టెంట్​ సర్జన్​ (జీడీఎంవో) పోస్టులు, చెన్నూర్​ సీహెచ్​సీలో మెడికల్​ ఆఫీసర్​ పోస్టు భర్తీ చేస్తామని పేర్కొన్నారు.  

గనుల్లో సేఫ్టీపట్ల రాజీ పడొద్దు
మందమర్రి/నస్పూర్,వెలుగు: బొగ్గు గనుల్లో సేఫ్టీపట్ల సింగరేణి రాజీపడకుండా ఎంప్లాయీస్​రక్షణకు ఫస్ట్​ ప్రయారిటీ ఇస్తోందని  మందమర్రి, శ్రీరాంపూర్​ ఏరియా జీఎంలు చింతల శ్రీనివాస్, బి.సంజీవరెడ్డి చెప్పారు. 53వ వార్షిక రక్షణ వారోత్సవాల్లో భాగంగా శనివారం మందమర్రి ఏరియాలోని కాసిపేట1, కేకే ఓసీపీ, ఆర్కేపీ సీహెచ్​పీ, శ్రీరాంపూర్​ ఏరియాలోని ఆర్కే-6 గనులను రక్షణ కమిటీ బృందాలు సందర్శించాయి. ఈ సందర్భంగా రక్షణ కమిటీ కన్వీనర్లు, జీఎంలు ఎస్​.వెంకటేశ్వర్లు(రెస్క్యూ), రవిప్రసాద్​( ఎస్టేట్​), చిన్ని బసవరెడ్డి(ఈఎం, స్టోర్స్), కె.వెంకటేశ్వర్లు(డైరెక్టర్ ఆపరేషన్స్​)జాన్​ ఆనంద్ (రీజియన్ సేఫ్టీ)లతో కలిసి ఏరియా జీఎంలు మాట్లాడారు.  ప్రతీ ఒక్కరు రక్షణ సూత్రాలు పాటిస్తూ డ్యూటీలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన ఎంప్లాయీస్​కు బహుమతులు అందజేశారు. అనంతరం రక్షణ కమిటీ సభ్యులు గనుల్లోని అండర్​గ్రౌండ్​ పనిస్థలాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏరియా ఎస్​వోటు జీఎం సీహెచ్​కృష్ణారావు, ఏజీఎం రాంమూర్తి, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఓదెలు, కేకే ఓసీపీ పీవో రమేశ్, మేనేజర్ మల్లన్న, డీజీఎం బాలాజీ భగవంతి ఝూ, ఎ.శ్రీధర్​రావు, ఏజెంట్ రాజేందర్, డీవైపీఎం శ్యామ్​సంఉదర్, కాసిపేట గని మేనేజర్ అలావొద్దీన్, శ్రీరాంపూర్​ఏరియా 5,6 గనుల ఏజెంటు ఏవీ రెడ్డి, ఆర్కే6 గని మేనేజర్​ తిరుపతి, కార్మిక సంఘాల లీడర్లు మేడిపల్లి సంపత్, కె.సురేందర్​రెడ్డి, సలెంద్ర సత్యనారాయణ, ఎండీ అక్బర్ అలీ, దాగం మల్లేశ్, ఇప్పకాయల లింగయ్య, డి.శంకర్​రావు తదితరులు పాల్గొన్నారు. 

రెసిడెన్షియల్​ స్కూల్​ను తనిఖీ చేసిన జడ్జి
బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లి గురుకుల పాఠశాలను శనివారం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి జి.హిమబిందు తనిఖీ చేశారు. టాయిలెట్స్, బెడ్​ రూమ్స్​ను పరిశీలించారు. టాయి లెట్స్​ బాగాలేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మరమ్మతుకోసం గురుకులాల సెక్రటరీకి నివేదించినట్లు ఇన్​చార్జి ప్రిన్సిపల్ శ్రావణ్, డిప్యూటీ వార్డెన్ వేణుగోపాల్ న్యాయమూర్తికి వివరించారు. పాఠశాలలో 547 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని.. కేవలం108 బెడ్స్ ​ఉండడం ఏమిటని ఆమె అసహనం వ్యక్తం చేశారు. సమస్యలను జిల్లా న్యాయమూర్తి ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తామని జడ్జి హిమబిందు వెల్లడించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ కోట బాబురావు, కోర్టు జూనియర్ అసిస్టెంట్ నిర్మల తదితరులు ఉన్నారు.

భోజనం పెట్టించండి
కాగజ్ నగర్,వెలుగు: కౌటాల గవర్నమెంట్​జూనియర్​కాలేజీలో మధ్యాహ్న భోజనం పెట్టించాలని స్టూడెంట్స్​శనివారం ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే విద్యార్థుల మేలుకోసం ఏదైనా చేస్తానని, మధ్యాహ్న భోజనం కోసం త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ విశ్వనాథ్, సర్పంచ్ మౌనీశ్​తదితరులు ఉన్నారు.

బోదకాలు వ్యాధి నివారణకు చర్యలు
నిర్మల్,వెలుగు: బోదకాలు వ్యాధి నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్​డైరెక్టర్​డాక్టర్ అమర్ సింగ్ నాయక్ తెలిపారు. శనివారం డీఎం అండ్​హెచ్​వో ఆఫీసులో నిర్వహించారు. ఈ నెల 20 ,21, 22 తేదీల్లో జరిగే మాస్ డ్రగ్ అడ్మిని స్ట్రేషన్ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, కన్సల్టెంట్ సైదులు, డీఎం అండ్ హెచ్ వో డాక్టర్ ధనరాజ్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాజారమేశ్, డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ నైనారెడ్డి, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ వో డాక్టర్ రాజేందర్, మాస్ మీడియా ఆఫీసర్ బారే రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

దళితులపై దాడులు ఆపాలి
ఖానాపూర్,వెలుగు: పెంబి మండలం మందపల్లి దళితులపై దాడులు చేసిన  వారిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల లీడర్లు డిమాండ్​చేశారు. శనివారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మస్కాపూర్ ఎల్ఆర్ గార్డెన్ లో దళిత ఆత్మగౌరవ సభ నిర్వహించారు. మందపల్లి గ్రామ దళితులపై కొందరు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. దసరా పండుగ  సందర్భంగా  సమైక్యత  జెండా స్థానంలో  కొందరు కాషాయ జెండా ఎగురవేశారని..దానిని అడ్డుకున్న దళితులపై దాడి చేయడం సిగ్గు చేటన్నారు. అధికార పార్టీ లీడర్లు మద్దతుపలకడం దారుణమన్నారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వీడీసీ చైర్మన్​పై పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. సభకు దాదపు నాలుగు వేల మంది దళితులు హాజరయ్యారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా సీఐ అజయ్ బాబు, ఎస్సై శంకర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. సభకు మాల మహానాడు జిల్లా కన్వీనర్ నేత శ్యామ్, లీడర్లు దాసరి రాజన్న, అభినవ్ సాహు, రేంజర్ల రాజేశ్, జీడీ సారయ్య, భైరీ నరేశ్, సిద్ధార్థ్​నాయక్, షబ్బీర్ పాషా, బన్సీలాల్, రాసమొల్ల అశోక్, బొమ్మెన రాకేశ్, అశోక్, స్వామి,  వెంకట్ రావు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.