- ఫైనల్ జాబితా ప్రకటించిన కమిషనర్లు
- పురుషులు 2,58,687, మహిళలు 2,76,946
- 12 మున్సిపాలిటీలు వార్డులు 303
- నేడు పోలింగ్ కేంద్రాల ముసాయిదా, 16న ఫైనల్ జాబితా
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఫైనల్ ఓటర్ జాబితాను మున్సిపల్ కమినర్లు ప్రకటించారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో 5,35,743 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్లలో పురుషులు 2,58,687, మహిళలు 2,76,946, ఇతరులు 111 మంది ఉన్నారు. 12 మున్సిపాలిటీల్లో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 18,259 మంది ఎక్కువగా ఉన్నారు. రెండు జిల్లాలలోని మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 303 వార్డులు ఉన్నాయి. మంగళవారం ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించాలని, 16న తుది జాబితా వెల్లడించాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు.
రిజర్వేషన్లపై ఉత్కంఠ
తుది జాబితా విడుదల కావడంతో ఇక రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు వార్డుల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఓటర్ లిస్ట్ లో గుర్తించి పబ్లిష్ చేస్తారు. లిస్ట్ లో గుర్తించిన ఎస్సి, ఎస్టీ, బీసీ జనాభా ఆధారంగా వార్డులను ఫిల్టర్ చేసి రిపోర్ట్ ప్రభుత్వానికి అందిస్తారు. వార్డుల రిజర్వేషన్ లను కలెక్టర్ ఓపెన్ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. 50 శాతం సీట్లు మహిళలకు రిజర్వ్ చేస్తారు. దీంతో ఆశావహులు ఇప్పటి నుంచే రిజర్వేషన్ల పై అంచనా వేసుకుంటున్నారు
నల్గొండ, సూర్యాపేట మున్సిపల్ ఓటర్ల వివరాలు
నల్లగొండ జిల్లాలో నల్లగొండ మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా పురుష ఓటర్లు 68,874 మంది, మహిళా ఓటర్లు 73,507 మంది, ఇతరులు 56 మంది ఉన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో కూడా 48 వార్డులు ఉండగా పురుషులు 45,128 మంది, మహిళలు 47,878 మంది, ఇతరులు 14 మంది ఉన్నారు. దేవరకొండ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను పురుషులు 11,629 మంది, మహిళలు 12,200 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. హాలియా మున్సిపాలిటీలో 12 వార్డుల్లో పురుష ఓటర్లు 6,270 మంది, మహిళా ఓటర్లు 6,529 మంది, ఇతరులు 2 మంది ఉన్నారు.
నందికొండ మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను పురుషులు 6,441 మంది, మహిళలు 7,079 మంది, ఇతరులు 1 మంది కాగా, చండూరు మున్సిపాలిటీలో 10 వార్డుల్లో పురుషులు 5,652 మంది, మహిళలు 5,717 మంది, ఇతరులు 1 మంది ఉన్నారు. అలాగే చిట్యాల మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను పురుషులు 5,930 మంది, మహిళలు 6,188 మంది, ఇతరులు 1 మంది ఉన్నారు.
సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులు ఉండగా పురుష ఓటర్లు 52,170 మంది, మహిళా ఓటర్లు 56,664 మంది, ఇతరులు 14 మంది ఉన్నారు. కోదాడ మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను పురుషులు 28,069 మంది, మహిళలు 30,520 మంది, ఇతరులు 12 మంది ఉన్నారు. హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో 28 వార్డుల్లో పురుషులు 14,257 మంది, మహిళలు 15,731 మంది, ఇతరులు 8 మంది ఉన్నారు.
నేరేడుచర్ల మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను పురుషులు 6,629 మంది, మహిళలు 7,116 మంది, ఇతరులు 1 మంది ఉన్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో 15 వార్డుల్లో పురుష ఓటర్లు 7,638 మంది, మహిళా ఓటర్లు 7,817 మంది ఉండగా ఇతరులు లేరు. ఈ గణాంకాల ప్రకారం రెండు జిల్లాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.
ఫైనల్ ఓటర్ లిస్ట్ రిలీజ్
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోని ఓటర్ల లెక్క పూర్తైంది. దీనికి సంబంధించి ఓటర్ల ఫైనల్ లిస్ట్‌ను సోమవారం ఆఫీసర్లు విడుదల చేశారు. ముసాయిదా ఓటరు లిస్ట్‌పై వచ్చిన 153 అభ్యంతరాలను పరిశీలించినట్టు పేర్కొన్నారు. ఫ్యామిలీ ఓట్లను ఒకే పోలింగ్ సెంటర్లో చేర్చారు. ముసాయిదా లిస్ట్ ప్రకారం 104 వార్డుల్లో 1,32,802 ఓట్లు ఉండగాచనిపోయిన వారు సహా మొత్తంగా 91 ఓట్లను తొలగించారు. దీంతో ఫైనల్ లిస్ట్‌లో వారి సంఖ్య 1,32,711కు చేరింది. పురుషులు 64,926 మంది ఉండగా మహిళలు 67,767 మంది ఉన్నారు.
మున్సిపాలిటీల ప్రకారం తేలిన ఓట్లు
భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డుల్లో మొత్తం 47,831 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు 24,793 మంది, పురుషులు 23,037 మంది, ఇతరులు ఒక్కరు ఉన్నారు. ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 13,632 మంది ఓటర్లు ఉండగా మహిళలు 6,960 మంది, పురుషులు 6,671 మంది, ఇతరులు ఒక్కరు ఉన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 12 వార్డుల్లో మొత్తం 13,822 మంది ఓటర్లు నమోదు కాగా మహిళలు 7,046 మంది, పురుషులు 6,760 మంది, ఇతరులు 16 మంది ఉన్నారు.
మోత్కూరు మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను మొత్తం 14,383 మంది ఓటర్లు ఉండగా మహిళలు 7,277 మంది, పురుషులు 7,106 , చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా 27,216 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు 13,663 మంది ఉన్నారు. పోచంపల్లి మున్సిపాలిటీలో 13 వార్డుల్లో మొత్తం 15,827 మంది ఓటర్లు ఉండగా మహిళలు 8,028, పురుషులు 7,799 మంది ఉన్నారు.
