- మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ మహిళలే కీలకం
- ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఓటర్ల తుది జాబితాను అధికారులు సోమవారం విడుదల చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపల్కార్పొరేషన్తో పాటు ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో మొత్తం 1,85,348 మంది ఓటర్లు నమోదయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
మహిళా ఓటర్లే అధికం..
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఓటరు కార్డుల ఆధారంగా డివిజన్లలో ఓటరు జాబితాను రూపొందించినట్టు ఆఫీసర్లు పేర్కొంటున్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో 205 అభ్యంతరాలొచ్చాయి. ఇల్లెందు మున్సిపాలిటీలో 21, అశ్వారావుపేట లో వందకు పైగా అభ్యంతరాలొచ్చాయి. అభ్యంతరాల్లో అత్యధికంగా ఓటర్లు డివిజన్ల మార్పులపై వచ్చినట్టు ఆఫీసర్లు తెలిపారు.
కొత్తగూడెం కార్పొరేషన్లో జనవరి ఒకటో తేదీన ప్రకటించిన తుది ఓటరు జాబితాలో 1,35,123 మంది ఓటర్లుండగా సవరణలు, అభ్యంతరాల తర్వాత తుది జాబితాలో 1,34,775 మంది ఓటర్లు నమోదైనట్టు కార్పొరేషన్ కమిషనర్ సుజాత పేర్కొన్నారు. ఇక ఖమ్మం జిల్లాలోనూ మున్సిపాలిటీ ఎన్నికల్లో మహిళలే కీలకంగానున్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య అన్ని మున్సిపాలిటీలోనూ ఎక్కువగా ఉంది. సత్తుపల్లి మున్సిపాలిటీ లో మాత్రమే ముసాయిదా ఓటర్ల జాబితాకు తుది జాబితాకు మధ్య సంఖ్యలో మార్పులు ఉండగా, మిగిలిన మున్సిపాలిటీలో మాత్రం ఎలాంటి మార్పులు చేర్పులు జరగలేదు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఓటర్ల వివరాలు..
మున్సిపాలిటీ/కార్పొరేషన్ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
కొత్తగూడెం 64,431 70,314 30 1,34,775
ఇల్లెందు 16,222 17,497 04 33,723
అశ్వారావుపేట 8,085 8,761 04 16,850
మొత్తం 87,738 96,572 38 1,85,348
ఖమ్మం జిల్లా ఓటర్ల వివరాలు..
మున్సిపాలిటీ మహిళలు పురుషులు ఇతరులు మొత్తం
వైరా 12,991 11,696 02 2 4,689
కల్లూరు 9,785 9,081 00 18,866
మధిర 13,424 12,251 04 25,679
సత్తుపల్లి 15,195 13,620 15 28,830
ఏదులాపురం 23,511 21,742 03 45,256
మొత్తం 74,906 68,390 24 1,43,320
