- వార్డుల వారీగా వెల్లడి
- ఇక రిజర్వేషన్లే తరువాయి
- అన్ని చోట్లా మహిళా ఓటర్లే అధికం
నిర్మల్/మంచిర్యాల/కాగజ్నగర్/ఆదిలాబాద్/బెల్లంపల్లి, వెలుగు: మున్సిపాలిటీ వార్డుల తుది ఓటర్ల జాబితాను సోమవారం సాయంత్రం అధికారులు ప్రకటించారు. మున్సిపల్ కమిషనర్లు, అధికారులు విడుదల చేశారు. ఈనెల 1న డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన అధికారులు 4వ తేదీ వరకు ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించారు. అయితే ఒకే కుటుంబంలోని వ్యక్తుల ఓట్లు వేర్వేరు వార్డుల్లో రావడం, మరికొందరివి మిస్ అవ్వడం లాంటి ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వచ్చాయి.
వలస వెళ్లినవారు, మరణించిన వారి ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇదే తరహా ఫిర్యాదులు వందల సంఖ్యలో వచ్చాయి. అధికారులు వాటిని పరిశీలించి పరిష్కరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం ఫైనల్ లిస్టు రిలీజ్ చేశారు. ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వారీగా ఫొటో ఓటరు లిస్టు రిలీజ్ చేయనున్నారు.
చెన్నూర్ మున్సిపాలిటీ
వార్డులు 18
మహిళలు 10,191
పురుషులు 9,711
ఇతరులు 09
మొత్తం ఓటర్లు 9,903
లక్సెట్టిపేట..
వార్డులు 15
మహిళలు 9,565
పురుషులు 8,765
ఇతరులు 01
మొత్తం ఓటర్లు 18,331
నిర్మల్ మున్సిపాలిటీ
వార్డులు 42
మహిళా ఓటర్లు 50,824
పురుషులు 47, 362
ఇతరులు 18
మొత్తం ఓటర్లు 98, 204
ఖానాపూర్..
వార్డులు 12
మహిళలు 9,169
పురుషులు 8,524
ఇతరులు 00
మొత్తం ఓటర్లు 17,693
మంచిర్యాల కార్పొరేషన్
డివిజన్లు 60
మహిళలు 91,111
పురుషులు 90,646
ఇతరులు 21
మొత్తం ఓటర్లు 1,81,778
బెల్లంపల్లి బల్దియాలో
వార్డులు 34
మహిళలు 23,012
పురుషులు 21,560,
ఇతరులు 03
మొత్తం ఓటర్లు 44,575
కాగజ్ నగర్ మున్సిపాలిటీ
వార్డులు 30
మహిళలు 26,193
పురుషులు 25,004
ఇతరులు 08
మొత్తం ఓటర్లు 51,205
ఆసిఫాబాద్..
వార్డులు 20
పురుషులు 6822
మహిళలు 7103
ఇతరులు 02
మొత్తం ఓటర్లు 13,927
ఆదిలాబాద్ మున్సిపాలిటీ
వార్డులు 49
మహిళలు 73,836
పురుషులు 69,813
ఇతరులు 06
మొత్తం ఓటర్లు 1,43,655
క్యాతనపల్లి..
వార్డులు 22
స్ర్తీలు 14,998
పురుషులు 14,732
ఇతరులు 01
మొత్తం ఓటర్లు 29,731
