కుండల మీద కాదు ఆమె కడుపు మీద కొట్టారు.. దివ్యాంగురాలనే జాలి కూడా లేదు.. మనసెలా వచ్చిందో !

కుండల మీద కాదు ఆమె కడుపు మీద కొట్టారు.. దివ్యాంగురాలనే జాలి కూడా లేదు.. మనసెలా వచ్చిందో !

ఆమెకు చేతులు, కాళ్లు సహకరించవు. గట్టిగా ఏ పనీ చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో చాలా వరకు అడుక్కుని పొట్టనింపుకోవాలని చూస్తుంటారు. కానీ ఆమె తన వైకల్యాన్ని సవాల్ చేస్తూ.. ఆత్మగౌరవంతో బతకాలనుకుంది. కుండల దుకాణం పెట్టుకుని బతకుబండిని లాగుతోంది.

అలాంటి దివ్యాంగురాలైన చిరు వ్యాపారిపైన అధికారులు ప్రతాపం చూపించడం సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. దివ్యాంగురాలిపైనా మీ ప్రతాపం.. ఆమె పొట్ట కొట్టారు కదా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలోని శంభాజీనగర్ లో జరిగింది.  

శంభాజీనగర్ లో రోడ్డు పక్కన కుండలు అమ్ముకుంటూ జీవనం గడుపుతున్న దివ్యాంగురాలి బతుకుదెరుపై దెబ్బ కొట్టారు మున్సిపాలిటీ అధికారులు. కుండల షాపును జేసీబీతో ధ్వంసం చేశారు. ఒక్కో కుండను జేసీబీ ముక్కలు ముక్కలు చేసింది. ఒక వైపు జేసీపీ ధ్వంసం చేస్తుంటే మరోవైపు సిబ్బంది కూడా పెద్ద పెద్ద కర్రలతో కుండలను పగలగొడుతున్న వీడియో చూసిన వారికి హృదయం చలించక మానదు. 

Also Read : తల్లిదండ్రులు ఇద్దరూ IAS అధికారులు

ఒకవైపు జేసీబీతో పాటు మున్సిపాలిటీ సిబ్బంది కుండలను ధ్వంసం చేస్తుంటే పగిలిన కుండ పెంకులను ఏరుకుంటూ ఆమె పడుతున్న మనోవేదన చూస్తే కన్నీళ్లు ఆగకమానవు. మానవత్వం ఎక్కడుంది. ఎకరాలకు ఎకరాలను ఆక్రమించిన వారిని పట్టించుకోరు.. ఇలాంటి కడుపులో పేగులేని అభాగ్య జీవులపై ప్రతాపం చూపిస్తారని నెటిజన్లు మండిపడుతున్నారు.

మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై జనాలు దుమ్మెత్తి పోస్తున్నారు. సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. క్రౌడ్ ఫండింగ్ చేసైనా సరే ఆమెను ఆదుకుంటామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అంతగా హైలెట్ కానీ ఈ న్యూస్.. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది.