లోకం తీరు.. ఓ పక్క ప్రాణాలు పోతుంటే.. మరోపక్క దారి దోపిడీ చేశారు

లోకం తీరు.. ఓ పక్క ప్రాణాలు పోతుంటే.. మరోపక్క దారి దోపిడీ చేశారు

ఆగ్రాలోని యమునా  ఎక్స్‌ప్రెస్‌వేలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రోడ్డు సరిగ్గా కనిపించక పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఉన్నావ్ సమీపంలో పొగమంచు వల్ల ఓ బస్సు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనగా.. ఆ వెంటనే వస్తోన్న కార్లు, ట్రక్కులు ఒకదాని వెంట మరొకటి బస్సును ఢీకొన్నాయి. దాదాపు 12వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఒకరు చనిపోయారు. అయితే ఇందులో చిక్కుకున్న ఓ కోళ్లతో వెళ్తున్న వాహనం కూడా ఉంది. యాక్సిడెంట్ జరగడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఆ వాహనంలోని కోళ్లను అటుగా వచ్చిన కొంతమంది పట్టుకుని పోవడం కెమెరాకు చిక్కింది.

ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందులో కొంత మంది తమ చేతుల్లో దొరికన కాడికి కోళ్లను పట్టుకుని నవ్వుతూ పారిపోతున్నారు. ఓ పక్క ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంటే.. మరో పక్క మాత్రం వీరు ఇలా తమ పని తాము ఈజీగా కానిచ్చేశారన్నమాట.

జేవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దయానత్‌పూర్ గ్రామ సమీపంలో ఆగ్రా వైపు వెళ్తున్న లేన్‌లో ఈ ప్రమాదం జరిగింది. నోయిడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గాయపడిన వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు.