హరోం హర మూవీ నుండి మురుగుడి మాయేరా అనే పాట విడుదల

హరోం హర మూవీ నుండి మురుగుడి మాయేరా అనే పాట విడుదల

సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘హరోం హర’. సుమంత్ జి నాయుడు నిర్మాత. శనివారం సుధీర్ బాబు బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ ఈ చిత్రం నుంచి ‘మురుగుడి మాయేరా’ అనే పాటను విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ఈ పాటను రఘు కుంచె పాడాడు. ప్రపంచంలో జరిగే ప్రతిచర్యకు కారణమైన మురుగన్ శక్తిని నిర్వచిస్తూ, కుప్పం యాసలో భరద్వాజ పాత్రుడు ఆకట్టుకునే లిరిక్స్ రాశాడు. సుధీర్ బాబు , సునీల్ పాత్రల మధ్య స్నేహాన్ని పాటలో చూపించారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న సినిమాను విడుదల చేయనున్నారు.