మూసీ పరీవాహక ప్రజలు అలర్ట్గా ఉండాలి : కలెక్టర్ హరిచందన సూచన

మూసీ పరీవాహక ప్రజలు అలర్ట్గా ఉండాలి : కలెక్టర్ హరిచందన సూచన

హైదరాబాద్ సిటీ, వెలుగు: వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కలెక్టర్ హరి చందన అధికారులను ఆదేశించారు. శుక్రవారం చాదర్ ఘాట్ ప్రాంతంలోని మూసీ నదిని ఆమె పరిశీలించారు. వర్షాలు అధికంగా కురుస్తుండడంతో పాటు హిమాయాత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి వరద ఉధృతి పెరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

నదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు విద్యుత్ సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, ట్రాఫిక్ అంతరాయం కలిగితే హెల్ప్ లైన్ నంబర్లు  040–  23202813, 7416687878 కాల్ చేయాలని సూచించారు. అలాగే రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు.