మణిశర్మకు మరో గోల్డెన్ ఛాన్స్.. డబుల్ డోస్ ఇచ్చి పడేయడం కన్ఫమ్

మణిశర్మకు మరో గోల్డెన్ ఛాన్స్.. డబుల్ డోస్ ఇచ్చి పడేయడం కన్ఫమ్

ఉస్తాద్ హీరో రామ్ పోతినేని(Ram pothineni) డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్(Puri jagannadh) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్ (Double Ismart). ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మణిశర్మను ప్రకటించారు. 

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ లో మణిశర్మ మ్యూజిక్ కీ రోల్ పోషించింది. అయితే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా లెవల్లో రానుంది కాబట్టి ఆ రేంజ్ కు తగ్గట్టుగా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకుంటారనే వార్తలు వినిపంచాయి. ఇక లేటెస్ట్ అప్డేట్ తో మణిశర్మనే న్యాయం చేయగలడనే మేకర్స్ ఫిక్స్ అయ్యారు. 

ఇది సీక్వెల్ కాబట్టి ఓల్డ్ మ్యూజిక్ ను రిపీట్ చేయాల్సి ఉంటుంది..ఆ మ్యాజిక్ రిపీట్ కావాలంటే మణిశర్మ అయితేనే బాగుంటుందని భావించారు మేకర్స్. అంతేకాదు..ఈ సినిమాకు సమందించిన మొదటి సాంగ్ రికార్డింగ్ కూడా కంప్లీట్ చేశారట మణిశర్మ. రామ్, పూరి, మణి..ఈ ముగ్గురి కాంబోలో వస్తున్న రెండో మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతూందో చూడాలి మరి. 

ప్రస్తుతం మణిశర్మ గ్రాఫ్ ను చూసుకుంటే..మణి సార్ మెలోడీ మ్యాజిక్ ఇప్పుడు అంతగా క్లిక్ కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అవుతు వస్తుండటం పెద్ద మైనస్ గా మిగిలిపోయింది. రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతోనే మణిశర్మ మళ్ళీ ఫామ్ లోకి రాగా ..ఇక ఆ సినిమా తర్వాత ఆయన ఏకంగా 13 సినిమాలకు మ్యూజిక్ చేసే అవకాశాన్ని అందుకుని ఆశ్చర్య పరిచాడు.

అంతే రేంజ్ లో కనీసం యావరేజ్ గా ఆడిన ఒక్క సినిమా కూడా లేదు. మెగాస్టార్ ఆచార్య మూవీకి ట్యూన్స్ పరంగా పరవాలేదు అనిపించినప్పటికి..ఇక ఆ సినిమా స్టోరీ విషయంలో దారుణంగా డిజాస్టర్ అందుకుంది. ఇక మరోసారి డబుల్ ఇస్మార్ట్ తో మణిశర్మ  స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తాడనే నమ్మకం ఫ్యాన్స్ లో బలంగా ఉంది.